ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్.. దేశంలో గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్‌లో బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. మౌళిక వసతుల విషయంలో హైదరాబాద్ నగరం వెనుకబడి లేదని కేటీఆర్ అన్నారు. నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో 5 వ స్నాతకోత్సవంలో మంత్రులు కేటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీల అమలు పై ట్రిపుల్ ఐటీ అధికారులను ప్రశ్నించారు మంత్రి.