తన చేతులతో నేసిన జీ20 లోగోను తనకు పంపిన తెలంగాణ నేత గురించి ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్ల నేత కార్మికులకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయడమే బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ అన్నారు మంత్రి కేటీఆర్. “ప్రియమైన నరేంద్రమోడీజీ, 2023 యూనియన్ బడ్జెట్‌లో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయడం. చేనేత ఉత్పత్తులపై జీఎస్‌టీ జీరో చేయడం సిరిసిల్లలోని నా నేత సోదరులు & సోదరీమణులకు ఉత్తమ రిటర్న్ బహుమతి. మీరు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాను’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు.
Also Read : Big Breaking: బండి సంజయ్ 5వ విడత పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తన 95వ మన్ కీ బాత్ ప్రసారంలో, మోడీ తెలంగాణకు చెందిన నేత హరిప్రసాద్ నుండి “విశిష్ట బహుమతి” అని ప్రశంసించారు. అతను నేసిన జీ20 లోగోను ప్రధానమంత్రికి పంపాడు. అయితే.. సమగ్ర పవర్‌లూమ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీమ్ (CPCDS) కింద రాష్ట్రంలోని సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ (MPC) మంజూరు చేయాలని కోరుతూ అనేక సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాసింది తెలంగాణ ప్రభుత్వం. ఇదిలావుండగా, జీ20 లోగోను ప్రధానికి పంపిన నేత యెల్ది హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఆర్ట్‌వర్క్ పూర్తి చేయడానికి మూడు రోజులు పట్టిందని, నవంబర్ 24న పంపామని చెప్పారు. జీ20 లోగోతో నేను నేసిన క్లాత్‌ను చూపుతూ ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో నా పేరును పదే పదే ప్రస్తావించడం చూసి సంతోషించాను అని హరిప్రసాద్ తెలిపారు.
Also Read : Fifa World Cup: మొరాకో విజయాన్ని జీర్ణించుకోలేక.. అల్లర్లు సృష్టించిన ఫ్యాన్స్