తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు, రాబోయే ఎన్నికల్లో వ్యూహాలను ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో వివరించారు హరీష్ రావు. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో వుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కేంద్రం కావాలని ఇబ్బంది పెడుతోంది. ఎనిమిదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో అంతా రివర్స్ అయింది. శుద్ధి చేసిన మంచినీరు అందిస్తోంది. తెలంగాణలో వడ్లు దిగుమతి బాగా పెరుగుతోంది. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారనేది విమర్శలు మాత్రమే. ప్రతి పైసా సద్వినియోగం చేస్తున్నాం. ఆనాడు తెలంగాణలో నీరు లేదు. పంటలు లేవు. కానీ ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయి.
మాకు ధాన్యం ఇవ్వమని కర్నాటక, తమిళనాడులు మనల్ని కోరుతున్నాయి. పంట విస్తీర్ణం పెరిగింది. కేంద్రం వల్ల కూడా అప్పులు బాగా పెరిగాయి. దేశంలో కంటే నిష్పత్తిలో తెలంగాణ అప్పులు తగ్గాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారు. ఆలస్యం వల్ల భారీగా వ్యయం పెరిగిపోతోంది. కేంద్రమంత్రి గడ్కరీ తెలంగాణ ప్రాజెక్టుల్ని ప్రశంసించారు. కాళేశ్వరం ఘనత మాదే. మేమే చేశాం. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజం అవుతుందని వారు భావిస్తున్నారు.
Read ALso: US Layoffs: అర్థరాత్రి టెక్ట్స్ మెసేజ్.. 2700 మంది ఉద్యోగాలు ఉఫ్
టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగింది. మీకు నచ్చితే చాలా గొప్పవాడన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రశంసించారు. రాజకీయం కోసం బీజేపీ నేతలు బాగా దిగజారతారు. ప్రజలకు పూర్తిగా అర్ధమైంది. దేశంలో డీజీల్, పెట్రోల్ పెరగడానికి కారణం ఎవరు? మోడీ పాలనలో మాటలెక్కువ, చేతలు తక్కువ. 8 నెలల్లో బీజేపీ నేతల ఫోకస్ పెరిగింది. మోడీ, అమిత్ షా పర్యటనలు వచ్చాయి. ఇన్నేళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం కేసీఆర్ మీద ఫోకస్ పెట్టారు. ఐటీ, ఈడీ రైడ్లు వేధింపులకు గురిచేయడానికే. బీజేపీ ఒక పనిగా పెట్టుకుంది. అన్ని రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ రైడ్స్ జరిగాయి. బీజేపీ నేత ఇంటిమీద ఇవి ఎందుకు జరగవు. బీజేపీని ప్రశ్నించిన వారిమీద రైడ్స్ జరుగుతాయి. ఒక విషయం మీద నిర్ణయం తీసుకుంటే.. కేసీఆర్ ఎలాంటి బెదిరింపులకు బెదిరేది లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద దాడులు జరిగాయి. ఇంకా జరుగుతాయి.
Read Also: Kishan Reddy: భిన్నకళలు, సంస్కృతిని కాపాడుకుందాం
జాతీయ రాజకీయాల్లోకి వస్తానంటేనే ఈ దాడులు జరుగుతాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు జరగవు. భయభ్రాంతులకు గురిచేసి లొంగాలని భావిస్తున్నారు. తెలంగాణ గడ్డ బెదిరింపులకు లొంగదు. ప్రేమతో, మంచి పనులతో లొంగుతారు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ తలసరి ఆదాయం బాగా పెరిగింది. జీఎస్డీపీ బాగా పెరిగింది. తెలంగాణలోకి పెట్టుబడులు ఆపాలని ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ వల్ల తెలంగాణ బలపడుతుంది. తెలంగాణలో రైతుబంధుని కేంద్రం కాపీ కొట్టింది. అనేక పథకాలు కాపీ కొట్టి అమలుచేస్తోంది. మనం ఇంటింటికీ నీరు అందిస్తే కేంద్రం కాపీ చేసింది. హర్ ఘర్.. హర్ జల్ అంటే అమలుచేస్తున్నారు. లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ నేతల పాత్ర వుందా? ఈ మాట బండి సంజయ్ ఎలా చెబుతారు? ఆయన జ్యోతిష్యం చెబుతారా? ఈడీ, ఐటీ అధికారా? ఈడీ, ఐటీలు మీ చెప్పుచేతల్లో వుంది. మీరు ఏం చెబితే అది జరుగుతుందన్నారు హరీష్ రావు. మా మీద బట్టకాల్చి మీద వేస్తున్నారు.ఈ ప్రభుత్వాన్ని మార్చాలని, కూల్చాలని ప్లాన్ చేశారు.
ప్రభుత్వాన్ని పడగొడతామంటే చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. సిట్ విచారణ జరుగుతోంది. వ్యక్తులు కాదు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఏం జరిగిందనేది బయటకు వస్తుంది. చివరకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని వివాదంలోకి లాగేశారు. బీఎల్ సంతోష్ పాత్ర ఆడియోల్లో బయటపడింది.బీజేపీకి సంబంధం లేదన్నారు. ఎందుకు కోర్టులకు వెళ్ళి ఎఫ్ఐఆర్ రద్దుచేయమంటున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే బీజేపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారు.
బీజేపీ వాళ్ళు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. ఐదు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడుచోట్ల డిపాజిట్ రాలేదు. తెలంగాణలో బీజేపీ, మెజారిటీ ప్రాంతాల్లో కాంగ్రెస్ మాకు పోటీ. అమిత్ షా, మోడీ రాబోయే ఎన్నికల్లో మేం గెలుస్తామని, మేకపోతు గాంభీర్యం వుంది. మునుగోడులో 50 వేలతో గెలుస్తామన్నారు. ప్రభుత్వం పడిపోతుందన్నారు. రాష్ట్రంలో నెల తర్వాత ప్రభుత్వం వుండదన్నారు నడ్డా. పార్టీలో ఆత్మస్థయిర్యం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. బలమయిన టీఆర్ఎస్ క్యాడర్ వుంది. అసెంబ్లీలో బడ్జెట్ పాసయ్యాక 15 వేల కోట్లు కట్ చేశారు. బోరుబావి దగ్గర మీటర్లు పెట్టనంటే 6వేల కోట్లు కట్ చేశారు. అప్పులు 40 వేల కోట్లు రాకుండా ఆపేశారు. కుట్రలన్నీ అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్పాలని భావించారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నాం. ఆర్థిక సంఘాలు నిధులు ఇవ్వమంటే కేంద్రం ఇవ్వలేదు. అందుకే కేంద్రం పిలిచిన ప్రీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లలేదు. నిరసన తెలిపాం. అంతేగానీ మేం నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు. అటు ఆరోగ్యం, ఇటు ఆర్థిక శాఖ బాధ్యతలు సంతృప్తిగా పనిచేస్తున్నాను. ఆరోగ్యశాఖ సంతోషంగా చూస్తున్నాను. కేసీఆర్ సూచనల మేరకు విధులు నిర్వహిస్తు్న్నా అన్నారు హరీష్ రావు.