Tippana Vijayasimha Reddy Appointed As Agro Industries Development Chairman: తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా తిప్పన విజయసింహారెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామక ఉత్తర్వును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బుధవారం ప్రగతి భవన్‌లో అందుకున్న తిప్పన.. తనకు ఈ అవకాశం ఇచ్చనందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో చైర్మన్ పదవిని ఇచ్చిన కేసీఆర్‌కి, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డలకు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు తిప్పన కృతజ్ఞతలు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తానని తెలిపారు. అటు.. కేసీఆర్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా.. మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడేనికి చెందిన విజయసింహారెడ్డి, టీఆర్ఎస్(2001) పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే నడిచారు. 2001 నుంచి 2006 వరకు టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన ఆయన.. ఆ తర్వాత 2006లో కాంగ్రెస్‌లో చేరి, 2016 వరకు ఆ పార్టీలో కొనసాగారు. 2016లో తిరిగి టీఆర్‌ఎస్‌లోకి చేరారు. 1989 నుంచి 1994 వరకు మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పన.. అదే సమయంలో ఆర్టీసీ గోల్కొండ రీజియన్ చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈయన మిర్యాలగూడ జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించగా.. విజయసింహారెడ్డిది ఆరోవది.