డ్రగ్ పరీక్షకు ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా.. మోడీని ఇమ్మంటా… మరొకరిని ఇమ్మంటా .. ఇస్తారా? అంటూ మంత్రి కేటీఆర్ మంగళవారం బండి సంజయ్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దొంగలు బడ్డ ఆరునెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకు అంటూ మండిపడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామ యువతి కిడ్నాప్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వేములవాడ పర్యటనలో ఉన్న కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను జ్యోతి కిడ్నాప్ విషయంపై వివరాలు కేటీఆర్ అడిగారు.