Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా వైట్ హౌజ్‌లో భేటీ అయ్యారు. ఒకప్పుడు ఉగ్రవాదిగా ముద్ర పడిన అల్ షరా ఇప్పుడు సిరియా దేశాధినేత. ఆయనపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది.
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున భీకరదాడులు చేసింది. రెబల్స్ ఆధీనంలో ఉన్న ఓడరేవులు, వారి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
Israel- Iran Conflict: ఇరాన్‌తో యుద్ధ సమయంలో ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేసేందుకు బాగా వెతికామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖట్జ్ ప్రకటించారు. కానీ, తమకు సరైన అవకాశం లభించక పోవడంతో అందులో విఫలమైనట్లు తెలిపాడు.
Benjamin Netanyahu: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధంలోకి అమెరికా రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి మరింత దిగడంతో పశ్చిమాసియా రగిలిపోతుంది. ఈ ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యహు కీలక ప్రకటన చేశారు.
Iran Russia Meeting: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ ఇరాన్ లోని అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల చేసింది.
America vs Iran: ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు మధ్యప్రాచ్యాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అదో ప్రమాదకరమైన ప్రాంతం అని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-గాజా మధ్య కొన్ని నెలలుగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా బందీలు-ఖైదీల మార్పిడి జరిగింది.
Iran: ఎప్పుడైతే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడులు చేసిందో అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో నిత్యం రణరంగంగా మారింది. ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా ఇరాన్, హమాస్, హిజ్బుల్లా కలిసి పనిచేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్‌కి భారీ హెచ్చరికలు చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయిల్‌ని నాశనం చేస్తామని ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) జనరల్ ఇబ్రహీం జబ్బారి నుండి తాజా హెచ్చరికలు వచ్చాయి.
Israel - Hamas: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్- హమాస్‌లు తమ అధీనంలో ఉన్న బందీలను దశల వారిగా విడుదల చేస్తున్నారు. తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్ రిలీజ్ చేయగా.. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టింది.
డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలి.. అలా జరగకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తానని అతడు హెచ్చరించారు.