US-Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఇరాన్‌కు తరలివెళ్తున్న అమెరికా బలగాలు
- మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు
- ఎయిర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన అమెరికా
- ఇరాన్‌కు తరలివెళ్తున్న అమెరికా బలగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్‌పై దాడి కోసం అమెరికా భారీ ప్రణాళికలు రచిస్తోంది. తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. తాజాగా మధ్య ప్రాచ్యంలో బలగాలు మోహరింపు కోసం అగ్ర రాజ్యం భారీ ‘ఎయిర్ బ్రిడ్జి’ని ఏర్పాటు చేసింది. మందుగుండు సామగ్రి, పరికరాలను రవాణా చేసే విమానాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఇరాన్ చుట్టూ అమెరికా యుద్ధ విమానాలు మోహరించాయి. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకతో సహా ఎఫ్-35సీ, ఇఎ-18 ఫైటర్ జెట్‌లు కూడా ఉన్నాయి. ఇటీవల కరేబియన్‌లో పనిచేసిన యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కూడా చేరుకుంది. ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ నివేదిక ప్రకారం.. జర్మనీలోని స్పాంగ్‌డాహ్లెం ఎయిర్ బేస్, ఇటలీలోని అవియానోఎయిర్ బేస్, సౌత్ కరోలినాలోని మెక్‌ఎంటైర్ జాయింట్ నేషనల్ గార్డ్ బేస్ నుంచి F-16 ఫైటింగ్ ఫాల్కన్లు మధ్యప్రాచ్యం వైపు కదులుతున్నాయి.
Also Read
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
ఇది కూడా చదవండి: NTRNeel : ఫస్ట్ లుక్ కూడా రాకుండానే రూ. 55 కోట్ల ఓవర్సీస్ డీల్.. NTR మాస్ ర్యాంపేజ్
ఇక యూకేలోని లేకెన్‌హీత్ RAF నుంచి F-15E స్ట్రైక్ ఈగల్స్, వర్జీనియాలోని జాయింట్ బేస్ లాంగ్లీ-యుస్టిస్ నుంచి F-22 రాప్టర్‌లు కూడా మోహరించాయి. ఈ విమానాలు గతంలో ఇరానియన్ అణు ప్రదేశాలపై దాడులు చేయడమే కాకుండా ప్రత్యేక కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాయి. RC-135 రివెట్ జాయింట్ ఇంటెలిజెన్స్ విమానాలు, P-8 పోసిడాన్ సముద్ర గస్తీ విమానాలు వంటి సహాయక విమానాలను కూడా తరలిస్తోంది. కొన్ని RC-135లు భద్రత కోసం గ్రీకు ద్వీపమైన క్రీట్‌కు మార్పు చేశారు. మరికొన్ని ఫ్లోరిడా నుంచి ప్రయాణిస్తున్నాయి. బహుళ ఇంధనం నింపే విమానాలు, వైమానిక కమాండ్, నియంత్రణ విమానాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ విమానాలు కూడా మోహరింపుల్లో చేరుకోనున్నాయి.
ఇది కూడా చదవండి: USA: అమెరికాలో మెరిసిన పెద్దపల్లి కళాకారుడు.. మహాభారత చిత్రంతో అదరగొట్టిన తెలుగోడు..
అణు ఒప్పందంపై ఇప్పటికే ఒమన్, జెనీవాలో అమెరికా చర్చలు జరిపింది. కానీ ఇరాన్ దారికి రాలేదు. అణు ఒప్పందం చేసుకునేందుకు నిరాకరించింది. అయితే ఇటీవల ‘బోర్డ్ ఆఫ్ పీస్’ మీటింగ్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు 10 రోజుల సమయం ఇస్తున్నామని ఆ సమయంలోగా డీల్ జరగకపోతే దాడి ఉంటుందని హెచ్చరించారు. కానీ ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికా దాడిని ఎదుర్కొంటామని.. సముద్రంలోనే నౌకలను ముంచేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ వారంలో ఇరాన్‌పై అమెరికా దాడి చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
The massive USAF airbridge to support future strikes on Iran continued overnight, with dozens of airlifters moving additional air defense assets and munitions into the Middle East. pic.twitter.com/qIqgc1YjFh
— OSINTtechnical (@Osinttechnical) February 22, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!