Israel: హమాస్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్ ఇటీవల భారత్‌ను అధికారికంగా కోరింది. హమాస్- లష్కరే తోయిబా (LeT) మధ్య సంబంధాలు పెరిగిపోతున్నాయని తెలిపింది. తాము ఇప్పటికే లష్కరే తోయిబాను తీవ్రవాద సంస్థ జాబితాలో చేర్చినందున, భారత్ కూడా ఇదే విధంగా స్పందించి హమాస్ ని తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని పేర్కొనింది. న్యూఢిల్లీ తీసుకునే నిర్ణయం దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
Read Also: PM Modi: పార్లమెంట్‌లో నేడు ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న మోడీ
అయితే, హమాస్- లష్కరే తోయిబా వంటి గ్రూపుల వ్యవస్థలు, నెట్‌వర్క్‌లు, వాటి అనుసంధానాలపై భారత ప్రభుత్వం స్పష్టమైన అవగాహన కలిగి ఉందని ఇజ్రాయెల్ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ సంస్థలను ఉగ్రవాద గ్రూపులుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొనింది. అలాగే, ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ (IRGC), హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాడులు చేయడానికి అంతర్జాతీయ నేరగాళ్ల నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నాయని టెల్ అవివ్ ఆరోపించింది. ప్రత్యక్షంగా దాడులు చేయకుండా, డ్రగ్ మాఫియా, మానవ అక్రమ రవాణాదారులు లాంటి నేరగాళ్లను ఉపయోగించి దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
Read Also: ఓరి దేవుడా, మరీ ఇంత తక్కువా.. Google Pixel 9 Proపై దిమ్మతిరిగే ఆఫర్ భయ్యో!
ఇక, 1987లో స్థాపించిన హమాస్‌ను అమెరికా, యూకే, కెనడా వంటి అనేక దేశాలు ఇప్పటికే తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిని భారత్ ఖండించినప్పటికీ, భారతీయ చట్టాల ప్రకారం హమాస్‌కు ఇప్పటి వరకు ఉగ్రవాద సంస్థగా గుర్తింపు ఇవ్వలేదు. హమాస్‌ను తీవ్రవాద సంస్థగా న్యూఢిల్లీ ప్రకటిస్తే అది ప్రపంచవ్యాప్తంగా బలమైన సందేశాన్ని ఇస్తుందని ఇజ్రాయెల్ పేర్కొంది. ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవులు వంటి దేశాలు భారత్ నిర్ణయాలను గౌరవిస్తాయని చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఆస్తుల ఫ్రీజింగ్ లేదా ప్రవేశ నిషేధం మాత్రమే కాదని, తీవ్రవాదంపై భారత్ తన స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రపంచానికి తెలియజేసే నిర్ణయమని టెల్ అవివ్ పేర్కొంది.