Israel- Iran Conflict: ఖమేనీని చంపడానికి చాలా వెతికాం.. కానీ, దొరకలేదు!
- ఖమేనీని హత్య చేసేందుకు బాగా వెతికాం..
- అజ్ఞాతంలోకి ఖమేనీ వెళ్లడంతో.. హత్య ప్రణాళికను రద్దు చేసుకున్నాం..
- సుదీర్ఘకాలం పాటు ఖమేనీ బంకర్లలో ఉండాలి, బయటకు వస్తే చస్తాడు: ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel- Iran Conflict: ఇరాన్‌తో యుద్ధ సమయంలో ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేసేందుకు బాగా వెతికామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖట్జ్ ప్రకటించారు. కానీ, తమకు సరైన అవకాశం లభించక పోవడంతో అందులో విఫలమైనట్లు తెలిపాడు. ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడంతో.. తాము హత్య చేసే ప్రణాళికను క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఆయన మాకు అందుబాటులోకి వస్తే.. అతడ్ని బయటకు తెచ్చే వాళ్లమని ఖట్జ్ పేర్కొన్నారు. దీంతో టెహ్రాన్ అగ్ర నాయకత్వాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్లు తొలిసారి అధికారికంగా ధ్రువీకరించింది.
Read Also: Patanjali: కొత్తవలసలో పతంజలి కర్మాగారం.. బాబా రాందేవ్ పర్యటన, పరిశీలన..!
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
అలాగే, ఐడీఎఫ్ దళాలు, ఇంటెలిజెన్స్ సంస్థలు గతంలో ఇరాన్ అణు సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని టెల్ అవీవ్ పేర్కొంది. కానీ, ఇప్పుడు ఇరాన్ నాయకత్వాన్ని చంపడానికి యత్నించినట్లు తేలింది. హెజ్‌బొల్లా చీఫ్ నస్రుల్లా లాగే సుదీర్ఘకాలం బంకర్లోనే ఉండాలని తాము ఖమేనీకి సూచిస్తున్నామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారో మాకు తెలుసు.. అతడ్ని చంపడం మాకు ఈజీ.. కానీ, మేము ఆయన్ను చంపబోమని జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Read Also: Honeymoon Murder Case: రాజా హత్య కేసులో ట్విస్ట్! మేజిస్ట్రేట్ ముందు ప్లేట్ ఫిరాయించిన నిందితులు
ఇక, ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ దేశ ప్రజల ఖమేనీ ఎక్కడ అని ప్రశ్నించడంతో.. జూన్ 26న తొలిసారి స్పందించారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగాన్ని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ గురువారం నాడు ప్రసారం చేసింది. 10 నిమిషాల పాటు సాగినా ఈ వీడియోలో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుప్రీంనేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!