Manipur: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. ఈ సమస్యను పరిష్కరించనుందుకు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో ఆయన మద్దతుదారులు సీఎం నివాసం ముందు ఆందోళన చేశారు. బీరెన్ సింగ్ రాజీనామా చేయొద్దని కోరారు.
రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ధ్వజమెత్తారు. మణిపూర్‌లో పరిస్థితికి రాహుల్ గాంధీ ప్రస్తుత విభేదాలను పెంచడం కంటే కరుణ అవసరమని అన్నారు.
Manipur: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య ఘర్షణలతో మండిపోతోంది. మైయిటీ, కూకీల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. ఇదిలా ఉంటే గురువారం మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లారు. అయితే ఆయన పర్యటనపై ఆల్ మణిపూర్ స్టూడెంట్ యూనియన్(AMSU) ఆగ్రహం వ్యక్తం చేసింది.
హింసతో రగిలిపోతున్న మణిపూర్‌లో రెండురోజులపాటు పర్యటించేందుకు రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో గురువారం అక్కడికి చేరుకున్న రాహుల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది.
విదేశీ పర్యటన ముగించుకొని దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి మణిపూర్‌లోని తాజా పరిస్థితుల గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వివరించారు.
జాతి ఘర్షణలు మణిపూర్‌ను అల్లకల్లోలం చేస్తు్న్నాయి. ఈశాన్య రాష్ట్రంలో మే 3 నుంచి అశాంతి కొనసాగుతోంది. తాజా పరిణామంలో ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చింగారెల్‌లో మణిపూర్ మంత్రి ఎల్ సుసీంద్రో ప్రైవేట్ గోడౌన్‌ను కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు.
మణిపూర్ రాష్ట్రంలో ఎన్ బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వాసం కోల్పోయారని మణిపూర్ హింసాకాండకు చెందిన తొమ్మిది మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.