Manipur: రాజీనామాపై వెనక్కి తగ్గిన సీఎం బీరెన్ సింగ్.. తాను రాజీనామా చేయనని ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. ఈ సమస్యను పరిష్కరించనుందుకు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో ఆయన మద్దతుదారులు సీఎం నివాసం ముందు ఆందోళన చేశారు. బీరెన్ సింగ్ రాజీనామా చేయొద్దని కోరారు.
ఇదిలా ఉంటే తాను రాజీనామా చేయబోవడం లేదని బీరెన్ సింగ్ ప్రకటించారు. ఇలాంటి కీలక సమయంలో తాను రాజీనామా చేయడం లేదని ట్వీట్ చేశారు. అంతకుముందు సీఎం బీరెన్ సింగ్ గవర్నర్ ని కలవడానికి బయలుదేరిన సమయంలో ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో రాజధాని ఇంఫాల్ లో హైడ్రామా చోటు చేసుకుంది. అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో, ఈరోజు సీఎం రాజీనామా చేస్తున్నారనే వార్తలు వ్యాపించడంతో ఆయన మద్దతుదారులు ఆయన నివాసం ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
"…I will not be resigning from the post of CM," tweets Manipur CM N Biren Singh pic.twitter.com/PM7T5NBH8B
— ANI (@ANI) June 30, 2023
Read Also: Uttar Pradesh: భార్యను కాల్చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. కొన ఊపిరితో ఉన్నా కాపాడని ప్రజలు
చాలా మంది ప్రజలు సీఎం రాజీనామా చేయవద్దని ఆయన మా కోసం ఎన్నో పనులు చేస్తున్నారని, మేము సీఎంకు మద్దతు ఇస్తున్నామని స్థానికులు తెలిపారు. వందలాది మంది యువకులు, మహిళలు నల్ల చొక్కాలు ధరించి బీరేన్‌సింగ్‌కు రాజీనామా చేయకూడదని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం ఎదుట బైఠాయించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని ఆయన మద్దతుదారులు కూడా రాజ్‌భవన్ వెలుపల గుమిగూడి విజ్ఞప్తి చేశారు.
#WATCH | Voices emerge in support of Manipur CM Biren Singh outside his residence in Imphal.
"We do not want the CM to resign, he should not resign. He is doing a lot of work for us. We are in giving support the CM," says the locals of Manipur pic.twitter.com/FnQ8Spu6Vw
— ANI (@ANI) June 30, 2023
మేము రెండు నెలలుగా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామని.. భారత ప్రభుత్వం, మణిపూర్ ఈ వివాదాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించే రోజు కోసం ఎదురుచూస్తున్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రాజీనామా చేస్తే మమ్మల్ని ఎవరు నడిపిస్తారని ఓ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేసింది.
దాదాపుగా రెండు నెలలుగా మే 3న ప్రారంభమైన ఘర్షణలు మణిపూర్లో కొలిక్కిరావడం లేదు. మైయిటీ, కుకీ ప్రజలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ, ఇళ్లు తగలబెడుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు 10 వేల మంది ఆర్మీ మణిపూర్ లో మోహరించారు. అయితే కొన్ని మిలిటెంట్ శక్తులు పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నాయి. సరిహద్దులోని మయన్మార్ నుంచి మిలిటెంట్లు ఊళ్లపై దాడులకు తెగబడుతున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!