Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక సంఘటలు జరుగుతూనే ఉన్నాయి. జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. శనివారం కేంద్ర హోంమంత్రి ఢిల్లీలో రాష్ట్ర పరిస్థితిపై అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉంటే స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన కారణంగా సైన్యం 12 మంది మిలిటెంట్లను విడుదల చేయాల్సి వచ్చింది. ఇంఫాల్ ఈస్ట్ లోని ఇథమ్ గ్రామాన్ని మిలిటెంట్లు దాగి ఉన్నారనే సమాచారంతో సైన్యం చుట్టుముట్టింది.
Read Also: Russia: ఫలించిన బెలారస్ మధ్యవర్తిత్వం.. వెనక్కి తగ్గిన వాగ్నర్ గ్రూప్.. చల్లారిన తిరుగుబాటు..
అయితే ఈ సమయం మహిళల నేతృత్వంలో దాదాపుగా 1500 మంది ఆర్మీ వాహనాలను చుట్టుముట్టి వారు ముందుకు వెళ్లకుండా ఆపేసింది. సైన్యం తమ విధులకు అడ్డురావొద్దని ఎంత సేపు హెచ్చరించినా.. ఇరు వర్గాలు మధ్య ప్రతిష్టంభన తొలగలేదు. దీంతో 12 మంది మిలిటెంట్లను ఆర్మీ వదిలేయాల్సి వచ్చింది. ఎలాంటి ప్రాణనష్టం, రక్తపాతం జరగకుండా ఆర్మీ పరిణితితో కూడిన నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెద్ద ఎత్తు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఆర్మీ స్వాధనం చేసుకుంది. మైయిటీ వర్గానికి చెందిన మిలిటెంట్ గ్రూప్ కేవైకేల్ సభ్యులు తప్పించుకున్నారు. ఇథమ్‌లో ప్రతిష్టంభన శనివారం కొనసాగింది. 2015లో 6 డోగ్రా యూనిట్‌పై దాడితో సహా అనేక దాడులలో మెయిటీ మిలిటెంట్ గ్రూప్ అయిన కంగ్లీ యావోల్ కన్నా లుప్ (KYKL) పాల్గొందని ఆర్మీ తెలిపింది. గ్రామంలో కీలకమైన మొయిరంగ్థెం తంబ అలియాస్ ఉత్తమ్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో ఉన్నాడు. అతను డోగ్రా ఆకస్మిక దాడికి ప్రధాన సూత్రధారి అని అధికారులు వెల్లడించారు.
మణిపూర్ లో మైయిటీ కమ్యూనిటికి ఎస్టీ హోదా ఇవ్వడాన్ని నిరసిస్తూ.. ఎస్టీ కమ్యూనిటీ ఆదివాసి సంఘీభావ యాత్ర నిర్వహించింది. ఆ సమయంలో హింస చెలరేగింది. మే 3న ప్రారంభమైన హింస ఇప్పటికీ తగ్గడం లేదు. మైయిట, కుకీ తెగల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ హింసకాండలో ఇప్పటి వరకు 100కు పైగా ప్రజలు మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు మరియు ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులు నాగాలు, కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు మరియు కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.
𝗢𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗶𝗻 𝗜𝘁𝗵𝗮𝗺 𝗩𝗶𝗹𝗹𝗮𝗴𝗲 𝗶𝗻 𝗜𝗺𝗽𝗵𝗮𝗹 𝗘𝗮𝘀𝘁 𝗗𝗶𝘀𝘁𝗿𝗶𝗰𝘁
Acting on specific intelligence, operation was launched in Village Itham (06 km East of Andro) in Imphal East by Security Forces today morning. Specific search after laying cordon was… pic.twitter.com/7ZH9Jp8nOI— SpearCorps.IndianArmy (@Spearcorps) June 24, 2023