మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతేడాది అల్లర్లతో మణిపూర్ అట్టుడికింది. పదులకొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి పదవికి బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది.
ప్రధాని మోడీ మణిపూర్ టూర్‌పై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ విమర్శలు గుప్పించారు. జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటించడం దురదృష్టకరం అన్నారు. ఇది ప్రధానుల సంప్రదాయం కాదని పేర్కొన్నారు.
ధైర్యం, ధైర్యసాహసాలకు మణిపూర్ నిలయం అని ప్రధాని మోడీ అన్నారు. రెండు జాతుల మధ్య జరిగిన హింస తర్వాత రెండేళ్లకు మణిపూర్‌లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. ఉదయం ఇంఫాల్‌కు చేరుకున్న ప్రధాని.. అక్కడ నుంచి రోడ్డుమార్గంంలో చరాచంద్‌పూర్ చేరుకున్నారు.
PM Modi Manipur Visit: జాతి ఘర్షణలతో రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్‌కు ప్రధాని నరేంద్రమోడీ రేపు వెళ్లనున్నారు. మే 2023లో రాష్ట్రంలో చెలరేగిన హింస తర్వాత తొలిసారి ప్రధాని పర్యటనకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధ్రువీకరించారు. ఈ పర్యటన గురించి చాలా రోజుల నుంచి ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ, తొలిసారిగా అధికారిక ప్రకటన వచ్చింది.
Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఆ రాష్ట్రంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న హింసనను అడ్డుకుని, శాంతిభద్రతలను పునరుద్ధరించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాష్ట్రంలోని 5 లోయ ప్రాంత జిల్లాల్లో నిర్వహించిన ఆపరేషన్లలో భారత ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Manipur: మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో మరోసారి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కుకీ, మైటీ వర్గాల మధ్య ఘర్షణలతో భద్రతా బలగాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
Waqf Row: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాడు వక్ఫ్ చట్టానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించిన మణిపూర్ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఎండి అస్కర్ అలీ ఇంటికి సుమారు 8 వేల మందితో కూడిన ఓ గూంపు వెళ్లి నిప్పు పెట్టింది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు.
Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన తర్వాత అక్కడ మైయిటీ, కుకీ మిలిటెంట్లు తమ ఆయుధాలను సరెండర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈరోజు కుకీలకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ నెలకొంది. మణిపూర్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక పరిపాలన ఏర్పాటు చేయాలనే తమ డిమాండ్ నెరవేరే దాకా రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగకూడదని కుకీలు నిరసన తెలుపుతున్నారు.
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో కేంద్రం ‘రాష్ట్రపతి పాలన’ విధించిన విషయం విదితమే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే పాలనా బాధ్యతలు రాష్ట్ర పతి చేతుల్లోకి వచ్చాయి. నేడు అక్కడి పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.