Manipur: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య ఘర్షణలతో మండిపోతోంది. మైయిటీ, కూకీల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. ఇదిలా ఉంటే గురువారం మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లారు. అయితే ఆయన పర్యటనపై ఆల్ మణిపూర్ స్టూడెంట్ యూనియన్(AMSU) ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ పొరపాటు వల్లే రాష్ట్రం హింసాత్మకంగా మారిందని ఏఎంఎస్యూ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) సెక్రటరీ జనరల్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..మణిపూర్ లో ప్రస్తుత ఘర్షణలకి మణిపూర్ ని పాలించిన ప్రభుత్వాలు, కాంగ్రెస్ చేసిన రాజకీయ తప్పిదాలే కారణం. 2012లో, మణిపూర్ పంచాయతీరాజ్ వ్యవస్థ నుండి ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో భాగమైన నాలుగు గ్రామ పంచాయతీలు మరియు ఒక జిల్లా పరిషత్ ని కాంగ్రెస్ పార్టీ తొలగించింది. వీటిని స్వయంప్రతిపత్తి కలిగిన కంగోజి జిల్లా కౌన్సిల్ కిందికి తీసుకువచ్చారని, ఇది కుకీల జాతీయ రాష్ట్ర కలల భూమిని మరింతగా మెరుగుపరిచిందని దుయ్యబట్టారు. ఇంఫాల్ పశ్చిమ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను ఎందుకు తొలగించారని ఆయన కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.
Read Also: Ee Nagaraniki Emaindi: నిజంగానే ఈ నగరానికి ఏమైంది.. సెకండ్ రిలీజ్లో నాలుగింతల కలెక్షన్సా?
కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ జవాబుదారీగా ఉంటారని మేము భావిస్తున్నామని, ఒక వేళ కాంగ్రెస్ జవాబుదారీగా లేకుంటే ఆయన ఇక్కడ ఉండి అర్థం లేదని స్టూడెంట్ యూనియన్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ స్పందించకుంటే మణిపూర్‌లోని పార్టీ నేతలందరినీ, రాష్ట్రంలో పర్యటించే జాతీయ కాంగ్రెస్ నేతలందరినీ బహిష్కరిస్తామని హెచ్చరించింది. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా, పౌర సమాజ సంస్థలు, విద్యార్థి సంస్థలు, మహిళా సంస్థలు, కమ్యూనిటీ సంస్థలు మణిపూర్ రాష్ట్రంలో విభజన సృష్టించవద్దని స్టూడెంట్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. మణిపూర్‌లో సమ్మిళిత శాంతిని తీసుకురావడానికి ప్రజలు “సృజనాత్మక మరియు నిర్మాణాత్మక అడుగులు వేయాలని, చేతులు కలిపాలని స్టూడెంట్ యూనియన్ కోరింది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించవద్దని, ప్రస్తుత ముఖ్యమంత్రిని మార్చవద్దని, మణిపూర్ లో ద్వంద్వ పరిపాలన ఉండవద్దని విజ్ఞప్తి చేశారు.
మే 3న మెయిటీ, కుకీ తెగల మధ్య హింసాత్మక సంఘటలు ప్రారంభమయ్యాయి. మెయిటీలకు ఎస్టీ హోదా ఇవ్వద్దని డిమాండ్ చేస్తూ గిరిజనులు చురచంద్రాపూర్ లో ర్యాలీ నిర్వహించారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇరు పక్షాలు ఇళ్లను దహనం చేశాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 115 మంది మరణించారు. మరోవైపు ఈ ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన మిలిటెంట్లు కూడా పరిస్థితిని ఉద్రిక్తంగా మారుస్తున్నారు.
#WATCH | Secretary General of All Manipur Students Union, says "…We believe that the current situation in Manipur is a result of the political blunders committed by successive governments that have ruled Manipur and Congress party has a big role to play in that. In 2012, the… pic.twitter.com/gHCxOhtV3u
— ANI (@ANI) June 29, 2023