Rahul Gandhi: మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను అడ్డగించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: హింసతో రగిలిపోతున్న మణిపూర్‌లో రెండురోజులపాటు పర్యటించేందుకు రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో గురువారం అక్కడికి చేరుకున్న రాహుల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. హింస చెలరేగిన చంద్రాపూర్ జిల్లా వైపుగా ఆయన కాన్వాయ్ వెళ్తుండగా.. ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపూర్ వద్ద పోలీసులు రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ సైతం ధృవీకరించింది.
జూన్ 29 నుంచి 30 వరకు రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ధృవీకరించిన సంగతి తెలిసిందే. మణిపూర్ దాదాపు రెండు నెలలుగా మండుతోంది. అక్కడ ప్రశాంతత వెల్లివిరియాలంటే సమాజంలో శాంతి అవసరమని కేసీ వేణుగోపాల్ అన్నారు. మే 3న మణిపూర్‌లో హింస చెలరేగినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితిపై ప్రతిపక్షాలు నిరంతరం ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. విపక్షాలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ పార్టీలు ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు ముందు అపాయింట్‌మెంట్ కోరాయి. దీని తర్వాత అన్ని పార్టీలు కలిసి మణిపూర్‌పై మెమోరాండం జారీ చేశాయి. వీటన్నింటి మధ్య హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష పార్టీల సమావేశానికి పిలుపునిచ్చారు. సమావేశంలో, హోంమంత్రి ప్రతిపక్ష పార్టీల వాదనలను విని, మణిపూర్‌లో పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు.
Also Read
- Virat Kohli Records: "నువ్వు మామూలోడివి కాదు సామీ".. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
- ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
- Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
- Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
మణిపూర్ ఎప్పటి నుంచి కాలిపోతోంది?
మే 3న ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ (ATSUM) ‘గిరిజన ఐక్యత మార్చ్’ చేపట్టింది. చుర్చంద్‌పూర్‌లోని టోర్బాంగ్ ప్రాంతంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. మే 3 సాయంత్రం నాటికి, పరిస్థితి మరింత దిగజారింది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి సహాయం కోరింది. అనంతరం ఆర్మీ, పారామిలటరీ బలగాల కంపెనీలను అక్కడ మోహరించారు. మెయిటీ కమ్యూనిటీ షెడ్యూల్డ్ తెగ హోదా డిమాండ్‌కు వ్యతిరేకంగా ఈ ర్యాలీ జరిగింది. మెయిటీ కమ్యూనిటీ చాలా కాలంగా షెడ్యూల్డ్ తెగ అంటే ఎస్టీ హోదాను డిమాండ్ చేస్తోంది. గత నెలలో మణిపూర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో మెయిటీ కమ్యూనిటీకి తెగ హోదా కల్పించాలనే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం హైకోర్టు ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. మణిపూర్ హైకోర్టు ఆదేశాలతో నాగా, కుకి తెగలు రెచ్చిపోయాయి. మే 3న ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ గిరిజన ఐక్యతా యాత్ర చేపట్టింది
మెయిటీలు గిరిజన హోదాను ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?
మణిపూర్‌లో మెయిటీ కమ్యూనిటీ జనాభా 53 శాతం కంటే ఎక్కువ. ఇవి గిరిజనేతర సంఘాలు, ఎక్కువగా హిందువులు. అదే సమయంలో, కుకి మరియు నాగా జనాభా దాదాపు 40 శాతం. రాష్ట్రంలో ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ, మెయిటీ కమ్యూనిటీ లోయలో మాత్రమే స్థిరపడగలదు. మణిపూర్ ప్రాంతంలో 90 శాతానికి పైగా కొండ ప్రాంతాలు ఉన్నాయి. 10 శాతం మాత్రమే లోయ ఉంది. కొండ ప్రాంతాలలో నాగా, కుకి కమ్యూనిటీలు లోయలోని మెయిటీలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మణిపూర్‌లో ఒక చట్టం ఉంది. దీని కింద, లోయలో స్థిరపడిన మెయిటీ కమ్యూనిటీ ప్రజలు కొండ ప్రాంతాలలో స్థిరపడలేరు లేదా భూమిని కొనుగోలు చేయలేరు. కానీ కొండ ప్రాంతాలలో స్థిరపడిన కుకి, నాగా గిరిజన సంఘాలు కూడా లోయలో స్థిరపడి భూమిని కొనుగోలు చేయవచ్చు. మొత్తం సమస్య ఏమిటంటే, జనాభాలో 53 శాతం కంటే ఎక్కువ మంది కేవలం 10 శాతం ప్రాంతంలో మాత్రమే నివసించగలరు, అయితే జనాభాలో 40 శాతం మంది 90 శాతం కంటే ఎక్కువ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
-
Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
-
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
ట్రెండింగ్
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!