మణిపూర్ రాష్ట్రంలో హింసాకాండ గత 45 రోజులుగా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట రెండు తెగల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనడంపై కేంద్ర ప్రభుత్వం నజర్ పెట్టింది. అయితే ఈ పరిష్కార మార్గాల్లో రాష్ట్రపతి పాలన అనేది తమ చిట్టచివరి ఆప్షన్ గా ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు మే 3న ప్రారంభించిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులపై దాడులు చేసి వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. సుదీర్ఘమైన జాతి హింస ఫలితంగా క్యాబినెట్ మంత్రులతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు దాడికి గురయ్యారు. ఈ హింస ఘటనలో బిజెపి నాయకుల నివాసాలను ధ్వంసం చేసి.. దాడికి ప్రయత్నించారు. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి ఆర్.కె రంజన్ సింగ్…
హింసాత్మకమైన మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం జూన్ 20 వరకు పొడిగించబడింది. మణిపూర్ ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజుల పాటు జూన్ 20 వరకు పొడిగించింది.
Manipur Violence: గత నెల రోజులుగా జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా శుక్రవారం అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు.
మణిపూర్‌లో జరిగిన హింస అనంతరం ఇంటర్నెట్ షట్‌డౌన్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ పై అల్లరిమూక నిప్పు పెట్టారు.. ఈ దారుణ సంఘటనలో చిన్నారితో సహా మరో ముగ్గురు సజీవదహనం అయ్యారు.. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిలో మీనా హాంసింగ్, ఆమె కుమారుడు టోన్సింగ్, వారి బంధువు లిడియా ఉన్నారు. వీరు అస్సాం రైఫిల్స్ రిలీఫ్ క్యాంపులో ఉంటున్నారు. తమ చుట్టుపక్కల…
హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో మరింత ఆందోళనలు జరగకుండా ఉండేందుకు మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని జూన్ 10 వరకు పొడిగించింది.