మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్యకు వ్యతిరేకంగా నిరసనలు బుధవారం ఉదయం తీవ్రమయ్యాయి, ఇంఫాల్‌లో పోలీసు సిబ్బందితో ప్రదర్శనకారులు ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
మణిపూర్‌లో కలహాల నేపథ్యంలో రెండు రోజుల తర్వాత మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. కొన్ని రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరో దారుణ ఘటన బయటపడింది.
2 Students Killed in Manipur who missing in July: మణిపుర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గత జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాతుల మధ్య వైరం కారణంగా అల్లర్లతో మణిపుర్ అట్టుడికిపోయిన సమయంలో ఈ ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు. మణిపుర్…
Manipur: గత మూడు నెలలుగా మణిపూర్ లో అల్లర్లు భారతదేశ అంతర్గత భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఈ అల్లర్లకు పక్కనే ఉన్న మయన్మార్ నుంచి వచ్చే కొన్ని శక్తులు కూడా కారణమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా మణిపూర్ లోకి మయన్మార్ నుంచి కుకీ తెగకు చెందినవారు వచ్చి అక్కడి జనాభా
మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ తెలిపారు.
Unrest in Manipur: గత కొన్ని నెలలుగా జాతి వివాదంతో పోరాడుతున్న మణిపూర్‌లో తీవ్రవాద సంస్థల క్రియాశీలత ఇప్పుడు ఆందోళనను పెంచింది. గత వారం గిరిజనులపై దాడికి ప్రయత్నించిన గుంపును అడ్డుకునేందుకు సైన్యం, అస్సాం రైఫిల్స్ జోక్యం చేసుకోవడంతో భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ రామన్ త్యాగిపై కాల్పులు జరిగాయి.
Manipur Violence: గత నాలుగు నెలలు మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. శాంతి నెలకొంటుందనుకునే సందర్భంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి మణిపూర్ లో టెన్షన్ వాతావరణం తలెత్తింది. భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. తెంగ్నౌపాల్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Manipur Violence: మణిపూర్‌పై ఐక్యరాజ్యసమితి(యూఎన్) నిపుణులు చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పపట్టింది. అనవసరమైన, ఊహాజనిత, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలుగా అభివర్ణించింది. మణిపూర్ లో పరిస్థితి శాంతియుతంగా ఉందని పేర్కొంది. శాంతిభద్రతలకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఐక్యరాజ్యసమితితో భారత మిషన్ స్పష్టం చేసింది.
Manipur Violence: కొన్ని నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరగుతోంది. అయితే అక్కడి ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇటీవల కొన్ని రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో మళ్లీ హింస చెలరేగింది.
MK Stalin: ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ అనే పోడ్కాస్ట సిరీస్ తొలి ఎపిసోడ్ లో బీజేపీపై విమర్శలు గుప్పించారు.