Manipur: జాతలు మధ్య ఘర్షణతో మణిపూర్ అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ జాతుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో మయన్మార్ లో సర్జికల్ స్ట్రైక్ చేసిన పారాకమాండోకు కీలక బాధ్యతను అప్పచెప్పింది. ప్రస్తుతం ఆయన రిటైల్ అయినా మణిపూర్లో పరిస్థితి శాంతిని నెలకొల్పేందుకు ఈ రిటైర్ ఆర్మీ అధికారి సాయం తీసుకుంటున్నారు.
మణిపూర్లో చెలరేగిన హింస ఇప్పటికీ ఆగే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు బాక్సింగ్ స్టార్ ఎంసీ మేరీకోమ్ తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
Manipur Violence: మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ తెగకు చెందిన ముగ్గురిని దుండగులు కాల్చిచంపారు. శుక్రవారం (ఆగస్టు 18) తెల్లవారుజామున 4.30 గంటలకు కుకి ప్రజలు నివసించే తోవాయి కుకి గ్రామ శివారులోని గుట్టల మటు నుంచి కాల్పులు జరిగాయి.
లోక్‌సభలో మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చ జరుగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం విరుచుకుపడ్డారు.
బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మణిపూర్‌లో ఎన్‌డీఏ మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయన్స్ (కేపీఏ) మద్దతు ఉపసంహరించుకుంది. కుకీ పీపుల్స్ అలయన్స్(కేపీఏ) అధ్యక్షుడు టోంగ్‌మాంగ్ హౌకిప్ మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉకేకి లేఖ రాశారు.
Manipur Violence: మణిపూర్లో మూడు నెలలుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మెయిటీ, కుకీ కమ్యూనిటీల ప్రజలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. బిష్ణుపూర్‌లో అర్థరాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారనే వార్త వెలుగులోకి వచ్చింది.
No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ మరోసారి వేడెక్కనుంది. ఈ ప్రతిపాదనపై ఆగస్టు 8 నుంచి చర్చలు ప్రారంభమవుతాయని, ఇది మూడు రోజుల పాటు అంటే ఆగస్టు 10 వరకు ఉంటుందని సమాచారం. విశేషమేమిటంటే.. చర్చల చివరి రోజున ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్లమెంటులో సమాధానం చెప్పబోతున్నారు.
Manipur Viral Video: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుపై ఈరోజు (జూలై 28) సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సుప్రీంకోర్టు సమాధానాలు కోరింది.