Manipur:మణిపూర్లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు.
Manipur Violence Latest Updates: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని మరోసారి కాల్పులు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలో బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ కమ్యూనిటీ మధ్య జరిగింది. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులుఅదృశ్యం అయ్యారు. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ నిర్వహించాయి. ఈ కాల్పుల వల్ల 100 మందికి పైగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు…
Manipur : మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో సోమవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దీని తరువాత రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధించబడింది.
Manipur : గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య హింస తీవ్ర రూపం దాల్చింది. ఈ కాలంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు.
Manipur: గత కొంత కాలంగా జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. రాష్ట్రంలో మైయిటీ, కుకీల మధ్య కొన్ని నెలలుగా ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో సుమారుగా 200 మంది వరకు మరణించగా.. చాలా మంది వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో చాలా కాలంగా ఉన్న తిరుగుబాటు గ్రూప్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(UNLF), కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా…
Manipur Violence: మణిపూర్లో మళ్లీ హింస మొదలైంది. ఇన్ని రోజులైనా ఇక్కడ పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. సోమవారం జరిగిన హింసాత్మక సంఘటనలో కాంగ్‌పోక్పి జిల్లాలో రెండు ప్రత్యర్థి సమూహాల మధ్య జరిగిన కాల్పుల్లో 6వ IRB పోలీసు హెన్మిన్లెన్ వైఫేతో సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Manipur: జాతి సంఘర్షణ కారణంగా అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రం రాజధాని ఇంఫాల్‌లో ఉన్న ఎయిర్‌పోర్టును మూసేశారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో గుర్తుతెలియని డ్రోన్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం గగనతలంలో గుర్తుతెలియన డ్రోన్ కనిపించింది. వెంటనే విమాన కార్యకలాపాలను మూసివేయాని అధికారులు ఆదేశించారు.
మణిపూర్ హైకోర్టు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో (కుల హింసకు గురికాని) మొబైల్ టవర్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన తర్వాత ఈ చర్య వచ్చింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య జరిగిన సమావేశం గురించి ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. తామిద్దరం పుల్వామా దాడి, జమ్మూ కాశ్మీర్లో పరిస్థితుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. అదానీ వ్యవహారం గురించి చర్చించినట్లు వెల్లడించారు. ఇద్దరి మధ్య ఈ భేటీ ఈడీ, సీబీఐల ప్రయేయాన్ని పెంచుతుందా..? అంటూ కేంద్రంపై వ్యంగాస్త్రాలు సంధించారు.