Manipur Violence: మణిపూర్‌లో టెన్షన్ టెన్షన్.. భద్రతా బలగాలు, సాయుధులకు మధ్య కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: గత నాలుగు నెలలు మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. శాంతి నెలకొంటుందనుకునే సందర్భంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి మణిపూర్ లో టెన్షన్ వాతావరణం తలెత్తింది. భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. తెంగ్నౌపాల్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Read Also: G20 Summit: మెగా డీల్‌పై ఇండియా, సౌదీ, అమెరికా చర్చలు.. టార్గెట్ చైనానే..
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
శుక్రవారం తెల్లవారుజామున మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తుల మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటలకు నుంచి ప్రారంభమైన కాల్పులు అడపాదడపా కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అంతకుముందు బుధవారం బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగాగ్ చావో ఇఖాయ్ లో వేలాది మంది గుమిగూడి ఆర్మీ బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత తాజా కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం జరిగిన ఘటనలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసు బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి అల్లర్లను అదుపు తెచ్చే క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనలకు ఒక రోజు ముందు మణిపూర్ లోని 5 లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.
ఈ ఏడాది మే3న మణిపూర్ లో జాతుల మధ్య హింస చెలరేగింది. మెయిటీ, కుకీ వర్గాలు ఒకరిపై ఒకరు, గ్రామాలపై దాడులు చేసుకుంటూ, ఇళ్లను తగలబెట్టుకున్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరక్ు 160 మందికి పైగా చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. ఎస్టీ హోదా కోసం మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ డిమాండ్ చేయడం, దీన్ని కూకీలు వ్యతిరేకించడంతో తగాదా ప్రారంభమైంది. మణిపూర్ జనాభాలో 53 శాతం మెయిటీలు 10 శాతం ఉన్న ఇంఫాల్ లోయ ప్రాంతంలో ఉంటే 40 శాతం మైనారిటీ కుకీలు 90 శాతం ఉన్న కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇదే ఈ రెండు తెగల మధ్య వివాదానికి కారణమైంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?