ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భౌతిక ప్రయాణం అవసరం లేకుండా.. ఈ సారాంశాన్ని అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అచంచలమైన దృఢ నిశ్చయంతో ప్రధాని వ్యవహరించారు.. మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రపంచ వేదికపై భారతదేశాన్ని శక్తివంతమైన, స్థిరమైన స్థానాన్ని పటిష్టం చేశాయన్నారు.
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అత్యంత ప్రముఖుడైన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఆయనకు నివాళులర్పించారు."బాపు జీవితం, సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి." అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
ఈ రోజు దేశం మొత్తం మహాత్మ గాంధీ జయంతిని జరుపుకుంటోంది. మన భారతీయ కరెన్సీ పై గాంధీ ఫొటోస్ ఉండటం చూస్తున్నాం.. కానీ ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు ఉండగా, ఆయన ఫోటోలను పెట్టడానికి అసలు కారణాలు చాలామందికి తెలియదు.. దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఆ స్టోరీ ఏంటో ఈరోజు గాంధీ జయంతి సందర్బంగా వివరంగా తెలుసుకుందాం.
ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్లమెంటులో సంచలన మార్పులు జరుగుతున్నాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సహా కీలక మహామహుల విగ్రహాల స్థానాలను మార్చడం తీవ్ర దుమారం రేపుతుంది.
గీతా ప్రెస్ ఆలయం కంటే తక్కువ కాదు, సజీవ విశ్వాసం అని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ ప్రసంగించారు. "గీతా ప్రెస్ ప్రపంచంలోని ఏకైక ప్రింటింగ్ ప్రెస్, ఇది ఒక సంస్థ మాత్రమే కాదు, సజీవ విశ్వాసం. గీతా ప్రెస్ కేవలం ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే కాదు, కోట్లాది మందికి దేవాలయం" అని ప్రధాని అన్నారు.
Delhi University : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో అనేక మార్పులు చేశారు. యూనివర్శిటీ ఐదవ సెమిస్టర్లో హిందుత్వ సిద్ధాంతకర్త డిడి సావర్కర్‌పై ఒక అధ్యాయాన్ని చేర్చింది. అదే సమయంలో మహాత్ముడికి సంబంధించిన అధ్యాయం ఏడవ సెమిస్టర్‌కు మార్చబడింది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ ( 89 ) ఇవాళ ( మంగళవరం ) తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.