Mahatma Gandhi: హైదరాబాద్ లోని ప్రగతినగర్ అంబేరుచెరువు దగ్గర మహాత్ముడికి అవమానం జరిగింది. గాంధీ జయంతి నాడు హడావిడిగా విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రారంభించారని., జన సంచారం లేని ప్రదేశంలో హడావిడిగా గాంధీ విగ్రహం ఏర్పాటు అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చీకటి పడితే మందుబాబులకి అడ్డాగా మారిన ఆ ప్రదేశంలో విగ్రహం ఎందుకు ఏర్పాటు చేసారంటూ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం గాంధీ పరువు కాంగ్రెస్ లీడర్లు తీస్తున్నారని, మందు బాబుల్ని నియంత్రించడం పోలీసుల వైఫల్యం అంటూ అక్కడి ప్రజలు వాపోతున్నారు.
Read Also: Karnataka : మసీదు లోపల ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడం నేరం కాదు.. కేసును కొట్టివేసిన హైకోర్టు
రాత్రుళ్లు చెరువు దగ్గర పెట్రోలింగ్ చేయాలని అక్కడి వాకర్స్ వాపోతున్నారు. మందు బాబుల్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం చెందారని., తాగుబోతులు మద్యం బాటిళ్లు పగలగొట్టడంతో గాయాల పాలవుతున్నామని కొందరు వాకర్స్ తెలిపారు.
Read Also: Omar Abdullah: నేడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం