Parliament: పార్లమెంట్లోని అంబేద్కర్, గాంధీ విగ్రహాల స్థానాల్లో మార్పులు.. కాంగ్రెస్ ఫైర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్లమెంటులో సంచలన మార్పులు జరుగుతున్నాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సహా కీలక మహామహుల విగ్రహాల స్థానాలను మార్చడం తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న దౌర్జన్యపు చర్య అని జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పార్లమెంట్ భవనం ముందు ఉన్న విగ్రహాలను మార్చడం చాలా దారుణమన్నారు.
Read Also: Rahul Gandhi: మోడీ, షా స్టాక్ మార్కెట్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు(వీడియో)
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోవడంతోనే పార్లమెంట్ ఆవరణలో ఉన్న ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం మార్చిందని కాంగ్రెస్ పార్టీ మీడియా, ప్రచార విభాగం అధ్యక్షులు పవన్ ఖేరా ఆరోపించారు. ఇక, గుజరాత్‌లో బీజేపీ అన్ని స్థానాలను గెలవకపోవడంతోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా మరో చోటుకు మార్చారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒకవేళ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే దేశ రాజ్యాంగాన్ని కూడా వాళ్లే మార్చేవారంటూ ప్రశ్నించారు.
Read Also: Babar Azam Record: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!
ఇక, పార్లమెంట్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగానే విగ్రహాలను మార్చామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ల్యాండ్ స్కేపింగ్ ఆధునీకరణ కోసం పార్లమెంట్ విగ్రహాలను ఒకే చోట ఉంచబోతున్నట్లు తెలిపారు. ఈ విగ్రహాలను పాత పార్లమెంట్ భవనం, పార్లమెంట్ లైబ్రరీ మధ్య ఉన్న గార్డెన్‌లో ఉంచారు. దీంతో పార్లమెంట్ ఆవరణలో ఉన్న ప్రముఖుల విగ్రహాలన్నీ ఇప్పుడు ఒకే చోటుకు చేరుకున్నాయి. ఇక, కేంద్ర ప్రభుత్వం చేసిన పనికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Statues of Chhatrapati Shivaji Maharaj, Mahatma Gandhi, and Dr. Babasaheb Ambedkar have just been removed from their places of prominence in front of the Parliament House. This is atrocious. pic.twitter.com/NA12QjCBAK
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 6, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!