Martyrs’ Day 2024: మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో సాకారం చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Martyrs’ Day 2024: మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో సాకారం చేశాం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. “సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.” అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేశారు.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ఇక, అంతకుముందు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించి.. జాతిపితగా నిలిచిన మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగాజరుపుకుంటారు.. 1948 జనవరి 30వ తేదీన నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్ముడిపై కాల్పులు జరపడం.. హే రామ్ అంటూ ఆ మహనీయుడు ప్రాణాలు విడిచిన విషయం విదితమే.. ఇవాళ ఆ మహాత్ముడి 76వ వర్ధంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.. గుజరాత్ రాష్ట్రంలోని కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2వ తేదీన కరంచంద్ గాంధీ, పుత్లీ బాయి దంపతులకు మహాత్మా గాంధీ జన్మించారు.
సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/JzQs860tFe
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2024
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!