గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ ( 89 ) ఇవాళ ( మంగళవరం ) తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
బాపూజీ మహాత్మాగాంధీపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ ఎలాంటి డిగ్రీలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం గ్వాలియర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Mahatma Gandhi statue defaced: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ఇండియాకు వ్యతిరేకంగా విదేశాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. బ్రిటన్, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు, రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కెనడా ఓంటారియో ప్రావిన్స్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో 2012 నుంచి విగ్రహం ఉంది.
గాంధీజీ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మార్గం ప్రపంచ మానవాళికి దిశానిర్దేశమన్నారు. ప్రస్తుతం దేశంలో అనేక రకాల అశాంతి, విభజన చోటు చేసుకుంటుందన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని గాంధీ పార్కులో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులర్పించారు. గాంధీ ఆశయాల కోసం కృషి చేద్దామని ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే నెల్సన్ మండేలా లాంటి నాయకులకు గాంధీ స్ఫూర్తి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచానికి గాంధీయిజాన్ని పరిచయం చేసిన గొప్ప మహనీయుడన్నారు.
అహింస సిద్ధాంతంతో గాంధీజీ.. బ్రిటీష్వారిపై పోరాడి విజయం సాధించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గాంధీ సిద్ధాంతం ఎప్పటికైనా విశ్వజనీనమని ఆయన అన్నారు. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు.