UCO Bank : ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తునకు సంబంధించి సీబీఐ కీలక చర్య తీసుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్లోని 67 చోట్ల సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది.
ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతపులి తల ప్రమాదవశాత్తూ బిందెలో ఇరుక్కుపోయింది. దీంతో 5 గంటల పాటు నరకయాతన పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. ఓ పశువుల పాకలోకి ఆహారం కోసమని వచ్చిన చిరుత.. ప్రమాదవశాత్తు తల బిందెలో ఇరుక్కు పోయింది. కాగా.. ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన…
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లను మార్చి 2న లంచ్కి రావాల్సిందిగా ఆహ్వానించారు. తన సొంత ప్రాంతం బారామతిలోని తన నివాసంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం పంపారు. శరద్ పవార్ రాజకీయ ప్రత్యర్థులైన వీరికి ఆహ్వానం పంపండం ప్రాధాన్యతన సంతరించుకుంది.
మహారాష్ట్రలో పుణెలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలుడిని వడపావ్తో ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసి హత్య చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
మహారాష్ట్రలో మరోసారి రిజర్వేషన్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబాద్ తాలూకాలోని తీర్థపురి పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ దగ్గర మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టినట్లు ఓ అధికారి వెల్లడించారు.
Ajit Pawar: దేశంలో మెజారిటీ ప్రజలు మరోసారి నరేంద్రమోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అజిత్ పవార్ పలు సందర్భాల్లో ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర అదికార కూటమిలో ప్రతీ ఒక్కరూ మోడీని గెలిపించడానికి పనిచేస్తున్నామని అజిత్ పవార్ ఆదివారం అన్నారు. బారామతిలో రైతుల ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు.
PM Modi : లోక్సభ ఎన్నికల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రాలకు కోట్ల విలువైన బహుమతులు ఇస్తున్నారు.
Former Maharashtra CM Manohar Joshi Dead: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూశారు. ఆయన వయసు 86. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని పీడీ హిందుజా ఆసుపత్రిలో చేరిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. మానోహర్ జోషికి వృద్యాప్య సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. మనోహర్ జోషి మరణ వార్తను పీడీ హిందూజా హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జాయ్ చక్రవర్తి ధృవీకరించారు. ఈరోజు మధ్యాహ్నం ముంబైలోని శివాజీ…
Maharastra : మహారాష్ట్రలో రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నట్లు వైద్యులు నోటీసులు జారీ చేశారు.