దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇక ఎండ వేడిమితో పిల్లలు, పెద్దలు అల్లాడిపోతున్నారు. ఒక వైపు వేడి గాలులు.. ఇంకో వైపు ఉక్కపోతతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా భారత వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Women Health: మద్యం తాగే మహిళల్లో ఈ వ్యాధులు ఎక్కువగా వస్తాయట.. జాగ్రత్త!
ఏప్రిల్ 5 వరకు ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఒడిశాలో ఏప్రిల్ 2 నుంచి 5 వరకు వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Bengaluru: ప్రియురాలు ఆ ప్రపోజల్ తిరస్కరించిందని ప్రియుడు ఏం చేశాడంటే..!
మార్చి నెల నుంచే ఎండల తీవ్రత అమాంతంగా పెరిగిపోయాయి. సూర్యుడు.. సుర్రుమంటున్నాడు. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో వేడి తీవ్రతను ప్రజలు భరించలేక అల్లాడిపోతున్నారు. ఇంకోవైపు ఉక్కపోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సాధ్యమైనంత మట్టుకు నీడపట్టున ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Divine Message 1: ఇస్కాన్‌పై సుబ్రమణ్యపురం దర్శకుడి “డివైన్ మెసెజ్ 1” !