కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాజాగా సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక, ఢిల్లీలో ఈ కేసు విచారణ జరుగుతున్న కోర్టులో సీబీఐ ఈ మేరకు దర్యాప్తు క్లోజర్ రిపోర్టును దాఖలు చేసింది. అయితే, యూపీఏ ప్రభుత్వ హయంలో ప్రఫుల్ పటేల్ విమానయాన శాఖ మంత్రిగా పని చేసినప్పుడు ఎయిర్ ఇండియా విమానాల లీజులో అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్లోజర్ రిపోర్టులో సీబీఐ వెల్లడించింది. ఈ క్లోజర్ రిపోర్టును విచారించి కేసును మూసివేసే అంశంలో నిర్ణయం తీసుకునేందుకుగాను ఏప్రిల్ 15వ తేదీన మరోసారి హాజరుకావాలని కేసు దర్యాప్తు అధికారికి కోర్టు నోటీసులను అందించింది.
Read Also: Health Tips : భోజనానికి ముందు వీటిని తాగితే త్వరగా బరువు తగ్గుతారు..
ఇక, శరద్ పవార్ అధ్యక్షుడిగా ఉన్న ఎన్‌సీపీని ఆయన మేనల్లుడు అజిత్ పవార్ చీల్చి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా చేరాడు. ఇక, సరిగ్గా ఇది జరిగిన 8 నెలల తర్వాత ఎన్‌సీపీ ముఖ్య నేత ప్రఫుల్ పటేల్‌కు సీబీఐ క్లీన్‌చిట్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీతో దోస్తీ చేస్తే తమపై ఉన్న కేసులు అన్ని మాయమైపోతాయని విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, అవసరం లేకున్నా ఎయిర్ ఇండియా కోసం అత్యంత ఎక్కువ ఖర్చుతో విమానాలు లీజుకు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్ పటేల్ మీద 2017లో సీబీఐ కేసు నమోదు చేయగా.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును విచారణ చేసింది.