Sharad Pawar : ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)గా పరిగణించింది. ఎన్నికల సంఘం ఈ నిర్ణయం పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు పెద్ద దెబ్బ.
Ajit Pawar: కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్‌కి షాక్ ఇచ్చింది. నిజమైన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అజిత్ పవార్‌దే అని, నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానిదే అని మంగళవారం ప్రకటించింది. పార్టీ గుర్తును ఉపయోగించుకునే హక్కును ఇచ్చింది. 6 నెలలుగా సాగిన, 10కి పైగా విచారణల అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
ప్రపంచం మొత్తానికి భారతదేశం అవసరం ఉంది.. దానికి అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే ఈ ప్రపంచం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
మహారాష్ట్రలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో సదరు శివసేన నేత తీవ్ర గాయల పాలయ్యాడు.
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
గతేడాది జూలై నెలలో మహారాష్ట్రలో రాజకీయంగా పెను దుమారం చెలరేగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఎమ్మెల్యేల బృందంతో కలిసి మహారాష్ట్రలో అధికార కూటమిలో చేరారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కూడా ప్రమాణం చేశారు.
Nagpur: జైలు నుంచి పెరోల్‌పై వచ్చినా కూడా అతని బుద్ధి మారలేదు. ఒక మహిళ, ఆమె మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జరిగింది. ఒక హత్య కేసులో దోషిగా తేలిని వ్యక్తికి ఇటీవల పెరోల్ మంజూరైందని, ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Cannibalism: సాధారణంగా కొన్ని జంతువులు మాత్రమే తన వర్గంలోని జంతువులను చంపి తింటుంటాయి. అయితే, పులుల వంటి జంతువులు పులి పిల్లల్ని చంపి తినడం చాలా అరుదు. అయితే మహారాష్ట్రలోని తాడోబా-అంధేరీ అభయారణ్యంలో మాత్రం ఓ పులి మాత్రం చిన్న పులి పిల్లల్ని చంపి తింటున్నట్లు తెలిసింది. రెండు పులుల నిర్వహించిన శవపరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. మరణించిన పులులను ఆరేళ్ల టీ-142, రెండేళ్ల టీ-92గా గుర్తించారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. అయితే ఆ పడవలో మొత్తం ఏడుగురు మహిళలు ప్రయాణిస్తున్నారు. అందులో ఒకరిని రక్షించారు. మరొకరు మృతి చెందగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Mumbai: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ర్యాలీలు జరిగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్లో ఆదివారం రాత్రి ఘర్షణ ఏర్పడింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు.