Emirates Airlines : ప్రయాణికులకు రిలీఫ్..! మళ్లీ ప్రారంభమైన దుబాయ్ విమానాలు
- భద్రతా కారణాలతో తాత్కాలికంగా నిలిపివేసిన విమానాలు
- మధ్యాహ్నం నుంచి మళ్లీ ప్రారంభమైన ఎమిరేట్స్ సర్వీసులు
- ప్రయాణికులకు కీలక సూచనలు చేసిన ఎయిర్‌లైన్ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్న ఎమిరేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emirates Flights Resume : దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Dubai International Airport) కు సంబంధించిన విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా వాటిని మళ్లీ ప్రారంభించినట్లు ప్రకటించింది. భద్రతా కారణాల వల్ల కొంతసేపు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపిన సంస్థ, పరిస్థితులు సమీక్షించిన తరువాత తిరిగి ఆపరేషన్లు ప్రారంభించినట్లు వెల్లడించింది.
శనివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఎమిరేట్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో మధ్యాహ్నం తర్వాత షెడ్యూల్ ఉన్న విమానాలకు టికెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావచ్చని తెలిపింది. ఇక దుబాయ్ ద్వారా ఇతర దేశాలకు ట్రాన్సిట్ ప్రయాణం చేసే వారికి కూడా ఈ సూచన వర్తిస్తుందని ఎమిరేట్స్ వెల్లడించింది. అయితే వారి కనెక్టింగ్ ఫ్లైట్ సాధారణంగా నడుస్తున్నట్లయితేనే ఎయిర్‌పోర్ట్‌కు రావాలని సూచించింది.
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
ఇదే సమయంలో ఉదయం 11:08 గంటలకు (దుబాయ్ సమయం) చేసిన ఒక పాత ప్రకటన ప్రస్తుతం అమల్లో లేదని సంస్థ స్పష్టం చేసింది. ఆ ప్రకటన వల్ల ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడకుండా ఉండేందుకు దాన్ని తొలగించినట్లు పేర్కొంది. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందు తమ విమానం స్థితి (Flight Status), సీట్ల లభ్యతను ఎమిరేట్స్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సంస్థ సూచించింది.
IND vs NZ Final: గంభీర్ కాస్త జాగ్రత్త! అహ్మదాబాద్ పిచ్‌పై టీమిండియాను ముంచే ‘ముల్లు’ ఇతనే!
పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైతే ఆపరేషన్ల షెడ్యూల్‌లో మార్పులు చేస్తామని ఎమిరేట్స్ తెలిపింది. ప్రయాణికుల భద్రత, సిబ్బంది రక్షణ తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. అయితే, ఇదే రోజున ఉదయం భద్రతా కారణాల వల్ల దుబాయ్‌కు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎమిరేట్స్ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావద్దని కూడా సూచించింది. తాజాగా పరిస్థితులు సర్దుబాటు కావడంతో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయని సంస్థ తెలిపింది.
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?