Lok Sabha Elections: మహారాష్ట్ర చంద్రపూర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వనితా రౌత్ తన విచిత్రమైన హామీలో వార్తల్లో నిలిచారు. చంద్రపూర్ జిల్లా చిమూర్ గ్రామానికి చెందిన వనితా రౌత్, తాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు సబ్సిడీపై విస్కీ, బీర్ అందిస్తానని ప్రకటించారు.
Coffee With Youth: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి మోడీ నేతృత్వంలో అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్డీయే కూటమి ఈ సారి 543 ఎంపీ స్థానాల్లో 400కి పైగా గెలుచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. బీజేపీ స్వతహాగా 370 స్థానాలు సాధించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేస్తోంది.
కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాజాగా సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
'ఏక్నాథ్ షిండే' నేతృత్వంలోని శివసేన తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం 8 మందిని ప్రకటించింది.
Govinda: ప్రముఖ బాలీవుడ్ స్టార్ గోవింద 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఆయన భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగు చూసింది. ముంబయిలోని మాల్వానీ ప్రాంతంలో రుతుక్రమం గురించి అవగాహన లేని ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి సారి పీరియడ్‌తో ఒత్తిడికి లోనైన ఆమె కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
Navneet Kaur Rana: లోక్‌సభ ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని పార్టీల కన్నా ముందే తన ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి ఓట్ల షేరింగ్ చర్చలు నడుస్తున్నాయి. దీంతో ముందే అభ్యర్థులను ప్రకటించి ఇండియా కూటమిని డిఫెన్స్‌లోకి నెట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది. మరోవైపు ఇండియా కూటమిలో పలు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ కుదరడం లేదు.