Nagpur: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఫోన్లో గట్టిగా మాట్లాడోద్దని సూచించినందుకు ఏకంగా ఓ తండ్రి కొడుకును కొట్టి చంపాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి రాడ్‌తో దాడి చేయడంతో అతని కొడుకు మరణించాడు. ఈ ఘటన నాగ్‌పూర్ జిల్లాలో నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్రా గ్రామంలో జరిగింది. నిందితుడు రాంరావు కక్డేని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనుంది. ఈ జాబితాలో 15 నుంచి 16 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
Death Penalty: 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడికి పూణే సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. పూణే జిల్లాలోని మావల్ తాలుకాలో 24 ఏళ్ల నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడిని దోషిగా తేలుస్తూ కోర్టు మరణశిక్ష విధించింది. ఆగస్టు 2022లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు. ఆ తర్వాత గొంతు కోసి చంపాడు. మరుసటి రోజు నిందితుడి పెరట్లో బాలిక మృతదేహం లభ్యమైంది.…
Junk Food: జంక్ ఫుడ్ తినడం ఓ యువకుడి ఆత్మహత్యకు కారణమైంది. జంక్ ఫుడ్ తిన్నందుకు తండ్రి మందలించడంతో 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న భూమిక వినోద్ ధన్వానీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఈ రోజు వెల్లడించారు. నగరంలోని సింధీ కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపింది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో తమ కూటమి అధికారంలోకి రావడానికి కారణం రెండు పార్టీల్లో చీలికని స్పష్టం చేశారు. ఆ చీలిక జరగడం వల్ల తనకు ఇద్దరు మిత్రులు లభించారని వివరించారు.
Rahul Gandhi: తాము అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాలను రక్షిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌తో కలిసి గురువారం మహారాష్ట్రలోని నాసిక్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా 'కిసాన్ మహాపంచాయత్'లో ప్రసంగించారు. నాసిక్ ఉల్లి, ద్రాక్ష, టొమాటోల సాగుకు ప్రసిద్ధి. మహాపంచాయత్ సభ సందర్భంగా రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు.
Rabies: కుక్కకాటు తర్వాత రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ యువతి కుక్క కరిచిన తర్వాత రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మూడు రోజుల తర్వాత రేబిస్‌తో మరణించింది. అత్యంత అరుదుగా జరిగిన ఈ ఘటన కొల్హాపూర్‌లో చోటు చేసుకుంది. మొత్తం 5 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదు.
Uddhav Thackeray: మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధింస్తుందని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలోని పుసాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అవమానిస్తోందని, బీజేపీ అవమానిస్తే తమతో చేరాలని ఠాక్రే కోరారు. ఒకప్పుడు అవినీతి ఆరోపణలతో కృపాశంకర్(మాజీ కాంగ్రెస్ నేత)ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, ఇప్పుడు ఆయనకు బీజేపీ తన మొదటి జాబితాలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని ఠాక్రే అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ…
మహారాష్ట్రలో ఓ మినీ బస్సు డ్రైవరు పెద్ద సాహసం చేశాడు. దోపిడీ దొంగల కాల్పుల్లో చేతికి బుల్లెట్ తగిలినా.. బస్సును ఆపకుండా 30 కిమీ నడిపి సురక్షితంగా పోలీస్‌స్టేషకు చేరుకున్నాడు. దాంతో దాదాపు 35 మంది ప్రయాణికుల ప్రాణాలను మినీ బస్సు డ్రైవర్ రక్షించాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని అమరావతి-నాగ్‌పూర్ హైవేపై షెగావ్ సమీపంలో చోటుచేసుకుంది. డ్రైవరు చూపిన తెగువతో తాము దోపిడీ దొంగలకు బారినుంచి సురక్షితంగా బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు. డ్రైవరు ఖోమ్‌దేవ్…