Varalaxmi Sarathkumar: సాయి మాధవ్ బుర్రా.. ‘రేప్’ వ్యాఖ్యలపై వరలక్ష్మీ సీరియస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Sarathkumar: నటిగా మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ తొలిసారి మెగాఫోన్ పట్టిన చిత్రం ‘S. సరస్వతి’. ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన రోజే ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియా వేదికగా ఓ సినిమా కథపై పరోక్షంగా సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తన కథను పూర్తిగా మార్చేశారని, అసలు కథను ‘రేప్’ చేశారంటూ సాయి మాధవ్ బుర్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక రచయితగా తన భావోద్వేగానికి భిన్నంగా సినిమా తీశారన్నది ఆయన వాదన. ఈ కామెంట్స్ S. సరస్వతి సినిమాపైనే చేశారని అందరూ చర్చించుకుంటున్నారు.
READ ALSO: Wife kills Husband: భర్త మరణించిన నెలలోపే మరో పెళ్లి.. అప్పుడే అసలు నిజం తెలిసింది..
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
అయితే తాజాగా ఈ కామెంట్స్‌పై వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు సాయి మాధవ్ బుర్రాపై గౌరవం ఉందని చెప్పారు. తాను ఈ కథను దొంగిలించలేదని, సరైన పద్ధతిలోనే డబ్బు చెల్లించి కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. ఒకసారి హక్కులు కొన్న తర్వాత ఆ కథ తన సొంతమని, ఆరేళ్లుగా ఆయన దగ్గరే ఉన్న బేసిక్ ప్లాట్‌ను నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చినట్లు తెలిపారు. సినిమాలో కథా రచయితగా ఆయనకు పూర్తి గౌరవం ఇచ్చానని గుర్తు చేశారు. సాయి మాధవ్ బుర్రా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఒక్కసారి కూడా కథా చర్చల్లో పాల్గొనలేదని వెల్లడించారు. ముఖ్యంగా మహిళా ఇతివృత్తంతో సాగే సినిమా విషయంలో ‘రేప్’ వంటి పదాలను వాడటం ఒక సీనియర్ రైటర్‌కు తగదని, “మహిళల పట్ల జరిగే అన్యాయంపై సినిమా తీస్తుంటే.. అదే సినిమా కథను రేప్ చేశారని అనడం నన్ను తీవ్రంగా బాధించింది” అని పేర్కొన్నారు.
READ ALSO: IND vs NZ Final: గంభీర్ కాస్త జాగ్రత్త! అహ్మదాబాద్ పిచ్‌పై టీమిండియాను ముంచే ‘ముల్లు’ ఇతనే!
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!