మహారాష్ట్రలోని నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు ఫ్యాక్టరీల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా విస్ఫోటనం జరిగినట్లుగా తెలుస్తోంది.
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీకి రాజీనామా చేశారు.
Shiv Sena MLA: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో పిల్లల్ని వాడుకోవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజుల తర్వాత, ఎమ్మెల్యే సంతోష్ బంగర్ పిల్లలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తనకు ఓటేయకుంటే మీరు రెండు రోజుల పాటు తినొద్దని కోరడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Congress: కాంగ్రెస్ పార్టీ మరో షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ముంబై ప్రాంతంలో కీలక నేతగా ఉన్న బాబా సిద్ధిక్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఏ కారణంగా తాను పార్టీని విడిచిపెడుతున్నాడనే విషయాన్ని వెల్లడించలేదు. ‘‘ కాంగ్రెస్ పార్టీలో నాది 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. ఈ రోజు నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి మిలింద్ దేవరా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా.. మరో సీనియర్ నాయకుడు బాబా సిద్ధిక్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు
Sharad Pawar:నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సంక్షోభం నేపథ్యంలో మంగళవారం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని ప్రకటించి శరద్ పవార్‌కి షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గంలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం శరద్ పవార్ వర్గం కొత్త పేర్లు, ఎన్నికల గుర్తులను సూచించాలని కోరింది.
షనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కలిగిన అజిత్ పవార్ వర్గానికే పార్టీ చిహ్నం, గుర్తును ఈసీ కేటాయించింది.