మహారాష్ట్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారును వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగంగా భారీగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే, మరికొందరు క్షేమంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. భండారా నగరానికి సమీపంలోని భిల్వారా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నానా పటోలేకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రక్కు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆగి ఉన్న కారును ట్రక్కు బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. తృటిలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం… డ్రైవర్ ట్రక్కుపై నియంత్రణ కోలుపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా పోలీసులు తేల్చారు.
ఇది కూడా చదవండి: TDP: కర్నూలు జిల్లా టీడీపీలో కుదుపు..! పార్టీకి కీలక నేతలు గుడ్‌బై..?
భండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రశాంత్ పడోలే తరపున నానా పటోలే ప్రచారం నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రమాదం విషయం తెలియగానే.. కాంగ్రెస్ అగ్ర నేతలంతా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచించారు.
ఇది కూడా చదవండి: Pidakala Samaram: పిడకల సమరం..! ఇంత ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉందా..?