Eknath Shinde: శివసేన పార్టీలో చీలిక తీసుకురావడంపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. బాలా సాహెబ్ థాకరే( ఉద్ధవ్ ఠాక్రే తండ్రి) మమ్మల్ని స్నేహితులుగా భావించేవారు, కానీ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం మమ్మల్ని ‘‘ఇంటి పనివారి’’గా భావించేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లోని రామ్‌టెక్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేనకు సైద్ధాంతిక మిత్రపక్షాలు కాని కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ..‘‘ పార్టీ సిద్ధాంతంతో రాజీపడినందుకు నేను విడిపోయాను’’ అని అన్నారు.
Read Also: Allahabad High Court: హిందూ వివాహానికి ఏడడుగులు తప్పనిసరి.. ‘కన్యాదానం’ అవసరం లేదు.. హైకోర్టు తీర్పు
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ-శివసేన మెజారిటీ సీట్లను దక్కించుకుంది. అయితే, గెలుపు తర్వాత సీఎం సీటుపై ఉద్ధవ్ ఠాక్రే పేచీ పెట్టడం, దానికి బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఆయన ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఈ ప్రభుత్వం పడిపోవడం, ఆ తర్వాత షిండే, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్సీపీలో చీలిక వర్షం అజిత్ పవార్ కూడా బీజేపీ-శివసేన(షిండే)తో ప్రభుత్వంలో చేరారు.
ఇదిలా ఉంటే, ఆదివారం నాగ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో షిండే మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకి ఓటు వేయాలని కోరారు. మళ్లీ ప్రధానిగా నరేంద్రమోడీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. అధికార కూటమిలో సీట్ల పంపిణీ మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని అన్నారు. మహారాష్ట్రలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.