Cruel Mother: ప్రపంచంలో మానవత్వం పూర్తిగా నశించిపోతుంది అని అనడానికి ఈ మద్య కొన్ని దారుణ సంఘటనలు చూస్తుంటే తెలుస్తుంది. వాయివరుసలు మరిచిపోయి కొందరు కామాందులు మహిళలపై రెచ్చిపోతున్నారు. అక్రమ సంబంధాలతో వైవాహిక బంధానికి మచ్చలు తెస్తున్నారు కొందరు మహిళలు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో దారుణాలు మన చుట్టూ జరిగిపోతూ ఉన్నాయి. ఇక ప్రపంచంలో దేవుడి తర్వాత అంతటి స్థానం కన్నతల్లికి మాత్రమే ఇస్తాం అలాంటి కన్నతల్లి తన పిల్లలను తానే హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో 5, 3 ఏళ్ల చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అమాయకులైన చిన్నారుల మృతిపై పోలీసులు విచారణ ప్రారంభించగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లలను సొంత తల్లే హత్య చేసినట్లు తేలింది. నిజానికి, ఆమె తన ప్రేమికుడితో పారిపోవాలనుకుంది. కానీ పిల్లలు దీనికి అడ్డుగా మారుతున్నారని భావించి కిరాతకంగా హత్య చేసింది ఆ కసాయి తల్లి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో తన ఇద్దరు పిల్లలను చంపినందుకు 25 ఏళ్ల మహిళను మంగళవారం అరెస్టు చేశారు. యువతి తన ప్రేమికుడితో కలిసి జీవించాలనుకుందని, పిల్లలను వదిలించుకోవడానికి ఈ నేరానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. శీతల్ పోల్ అనే మహిళ మార్చి 31న తన ఐదేళ్ల కూతురు, మూడేళ్ల కొడుకును హత్య చేసిందని ఓ అధికారి తెలిపారు.
తన భర్తను విడిచిపెట్టి వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, పిల్లలు అడ్డుగా ఉన్నారని హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది. మార్చి 31 సాయంత్రం పిల్లలను శీతల్ టవల్ ముక్కు, నోరు ఊపిరాడకుండా చేసి చంపింది. ఘటన జరిగిన సమయంలో తన భర్త ఇంట్లో లేడని, భర్త తిరిగి వచ్చేసరికి పిల్లలు నిద్రిస్తున్నారని చెప్పింది. అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలను గుర్తించిన భర్త వారిని అలీబాగ్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు. విచారణలో, సంఘటనల గురించి శీతల్ ఇచ్చిన వాంగ్మూలంలో పోలీసులు వైరుధ్యాలను కనుగొన్నారు. చివరికి ఆమె తన నేరాన్ని అంగీకరించిందని అధికారి తెలిపారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఆమెతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తిని కూడా విచారించారు. మంగళవారం కోర్టు మహిళను మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపిందని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.