ఏ కాలంలో అయినా డబ్బులు వచ్చే వ్యాపారం ఏదైనా ఉందంటే అది మద్యం వ్యాపారమే. పరిస్థితి ఎలా ఉన్నా.. రేటు ఎలా ఉన్నా మద్యం బాటిళ్ల కోసం మందుబాబులు ఎగబడతారు. అందులోనూ ఇక ఉచితంగా దొరికితే వదిలిపెట్టే సమస్యే లేదు. తాజాగా తమిళనాడులోని మధురైలో ఉచిత మద్యం కోసం జనాలు ఎగబడ్డారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా మనోళ్లు వదలరు. అలాంటిది క్వాటర్ బాటిల్స్ దొరికితే, బీరు బాటిల్స్ బాక్సులు కనపడితే వదులుతారా..? Kerala: కేరళలో కొత్త…
కర్ణాటకలోని విద్యా సంస్థల్లో మొదలైన హిజాబ్ వ్యవహారం.. మరికొన్ని రాష్ట్రాలకు పాకింది.. ఇప్పుడు తమిళనాడును కూడా తాకింది.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్ ధరించి వచ్చిన ఓ మహిళను బీజేపీ బూత్ ఏజెంట్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.. హిజాబ్ తొలగించిన తర్వాతే ఆ మహిళ ఓటు వేయాలని.. అప్పుడే ఓటు వేయడానికి అనుమతించాలంటూ బీజేపీ ఏజెంట్ పోలింగ్ బూత్‌లో వీరంగం సృష్టించాడు.. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా.. డీఎంకే, అన్నాడీఎంకే సహా ఇతర…
మదురైలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది.. దాదాపు నగరంలో ఏడు కిలోమీటర్ల వరకు ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి… అయితే, ఇవాళ అకస్మాత్తుగా ఐదువందల మీటర్ల మేర ఫ్లైఓవర్ కూలిపోయింది… ప్రమాద సమయంలో ఫ్లైఓవర్ కింద పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు, నిర్మాణ పనుల్లో ఉన్న సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది.. భారీ క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగింపు ప్రయక్రియ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్టుగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలైనట్టుగా చెబుతున్నారు…
ప్రజలను ఆకర్షించడానికి ఆయా కంపెనీలు, సంస్థలు, హోటళ్లు.. ఇలా చాలా మంది ఆఫర్లు పెడుతుంటారు… దీంతో.. ప్రజలు తమ వెసులుబాటును బట్టి.. కొనుగోళ్లకు మొగ్గు చూపుతుంటారు.. ఇక, బిర్యానీపై ఆఫర్ పెడితే.. అది కూడా 5 పైసలకే ఓ బిర్యానీ అంటే వదిలిపెడతారా..? ఎగబడి మరీ బిర్యానీ తీసుకోవడానికి పోటీపడ్డారు.. ఓవైపు కరోనా మహమ్మారి భయాలో ఉన్నా.. కోవిడ్ రూల్స్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. బిర్యానీ దొరికితే చాలు అనే రీతిలో ఎగబడ్డారు ప్రజలు. ఐదు పైసలకే…
కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేట్ సంస్థలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడులోని మధురైలోని ఓ సెలూన్ షాప్ యజమాని వినూత్న ఆఫర్‌ను ప్రకటించాడు. Read: వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి : కేంద్రాన్ని కోరిన కేటీఆర్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సెలూన్ లో 50శాతం డిస్కౌంట్‌ను ప్రకటించాడు. వ్యాక్సిన్ తీసుకుని నెగెటీవ్ సర్టిఫికెట్ తీసుకొని వస్తే 50శాతం…
కరోనా.. ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు కరోనాకు చెక్ పెట్టేందుకు.. వ్యాక్సిన్ ప్రక్రియను అన్నీ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇంతలోనే.. నెల్లూరు ఆయుర్వేద మందు అని పెద్ద వివాదమే కొనసాగుతోంది. ఇంకా మిగతా చోట్ల కూడా కరోనాకు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు విరుగుడు అంటూ చచ్చిన పామును కొరికి నమీలేశాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి. మధురై జిల్లా పేరుమపత్తికి…
కరోనా కాలంలో వివాహాలు విచిత్రంగా జరుగుతున్నాయి. కొంత మంది ఆన్‌లైన్ ద్వారా వివాహాలు చేసుకుంటే, మరికొందరు పరిమిత సంఖ్యతో వివాహాలు చేసుకుంటున్నారు. అయితే, తమిళనాడులోని మధురైకు చెందిన ఇద్దరు వ్యాపావేత్తల పిల్లల వివాహం విచిత్రంగా జరిగింది. మధురై నుంచి తుత్తుకూడి వరకు ఓ ప్రైవేట్ జెట్ విమానం బుక్ చేసుకున్నారు. అందులో మొత్తం 161 మంది అతిధులు బయలుదేరారు. మధురై నుంచి విమానం బయలుదేరగానే వధువు దక్షిణ మెడలో వరుడు రాకేష్ తాళి కట్టాడు. మధురై నుంచి…