Tamil Nadu: తమిళనాడులో బీజేపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. మధురైలో బీజేపీ ఓబీసీ విభాగం నేత గురువారం ఉదయం గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తిని శక్తివేల్‌గా గుర్తించారు. బీజేపీ ఓబీసీ విభాగం జిల్లా కార్యదర్శిగా ఉన్న ఈయన గురువారం ఉదయం ఫైనాన్సింగ్ పనిలో నిమగ్రమై ఉండగా.. సాంగు నగర్‌లోని గోదాం వద్దకి వెళ్తున్న క్రమంలో దాడి జరిగింది.
తమిళనాడులోని మధురై జిల్ల అలంగనల్లూరు సమీపంలోని కీలకరైలో నూతనంగా నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించిన స్టేడియం ఇదే కావడం గమనార్హం.
Tamil Nadu: సామాన్యంగా గజం భూమిని కూడా ఫ్రీగా ఇచ్చే రోజులు కావు. భూమి అంటే గౌరవం.. తులం బంగారం పోయినా పర్వాలేదు కానీ, ఇంచు భూమి కోసం హత్యలు జరిగే కాలం ఇది. అయితే తమిళనాడులో ఓ మహిళ మాత్రం చేసిన పనిని చూస్తే నువ్వు త్యాగమూర్తివమ్మ అని అనకుండా ఉండలేదు. ఏకంగా కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వ పాఠశాల కోసం విరాళంగా ఇచ్చేసింది.
Bharat Express: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి ఏకకాలంలో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ 9 రైళ్లు ప్రయాణికులకు దేశంలోని అనేక మతపరమైన, ఇతర పర్యాటక ప్రదేశాలకు ప్రీమియం, సూపర్‌ఫాస్ట్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.
మధురైలో జరిగిన రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వేని కోరారు.
9 dead in Train Fire near Madurai Railway Station: తమిళనాడులోని మధురైలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు టూరిస్ట్ కోచ్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రైలు బోగీ పూర్తిగా కాలిపోగా.. 9 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత…
5 Killed In Fire At Fireworks Godown In Madurai: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన గురువారం మధురై జిల్లాలోని తిరుమంగళం లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. అయితే ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా సింధుపట్టి…
మధురైలో ఉసిలంపల్లిలోని ఈశ్వరి అమ్మవారి ఆలయ ఉత్సవాలలో ఘర్షణ చోటుచేసుకుంది. ఉత్సవాల సమయంలో ప్రత్యేక పూజల విషయంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. ఒకరినొకరు కర్రలతో, రాళ్లతో ఆలయంలోనే కొట్టుకున్నారు ఇరువర్గాల వారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇరువర్గాల ఘర్షణల్లో గాయపడినవారిలో పోలీసులు కూడా ఉన్నారు. అయితే, ఉత్సావాల సమయంలో ప్రత్యేక పూజల విషయంలో రెండు వర్గాలలో విబేధాలే ఈ ఘర్షణకు కారణంగా తేల్చారు…
Inspirational News: సహజంగా తండ్రిని కొడుకు ఆదర్శంగా తీసుకుంటాడు. కానీ ఈ కథ వేరు. తండ్రే కొడుకు బాటలో నడిచాడు. డాక్టర్ అవ్వాలనే జీవితాశయాన్ని నెరవేర్చుకునేందుకు ఏకంగా 55 ఏళ్ల వయసులో 'నీట్'కి హాజరయ్యాడు. అతని పేరు కె.రాజ్యక్కొడి. తమిళనాడులోని మదురై వాసి. రైతు.
ఎంతకీ పెళ్లి కావడం లేదని ఓ యువకుడు వెరైటీగా ఐడియా వేశాడు.. తన పేరు, కులం, జీతం, వృత్తి, కాంటాక్ట్ నంబర్ , ఫొటో, అడ్రస్.. ఇలా అన్నీ పొందుపరుస్తూ.. ఓ పోస్టర్ను డిజైన్ చేయించాడు.. ప్రింట్ వేయించి ఊరంతా అంటించాడు.. ఇప్పుడా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..