కరోనా.. ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు కరోనాకు చెక్ పెట్టేందుకు.. వ్యాక్సిన్ ప్రక్రియను అన్నీ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇంతలోనే.. నెల్లూరు ఆయుర్వేద మందు అని పెద్ద వివాదమే కొనసాగుతోంది. ఇంకా మిగతా చోట్ల కూడా కరోనాకు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు విరుగుడు అంటూ చచ్చిన పామును కొరికి నమీలేశాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి. మధురై జిల్లా పేరుమపత్తికి చెందిన వడివేలు వ్యవసాయ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల బాగా మద్యం తాగి చనిపోయిన కట్లపామును ఒకదానిని మెడలో వేసుకొని డాన్స్ లేశాడు. పామును తింటే కరోనా రాదని చెబుతూ దానిని నమిలి తినేశాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో జిల్లా ఫారెస్ట్ అధికారులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు స్పందించి వడివేలును అరెస్ట్ చేశారు. అంతేకాదు అతడికి రూ. 7 వేల ఫైన్ కూడా విధించారు పోలీసులు.