తమిళ సినీ సూపర్‌స్టార్, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్‌పై, ఆయన బౌన్సర్లపై కున్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మదురైలో ఇటీవల జరిగిన టీవీకే భారీ బహిరంగ సభలో శరత్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో గాయాలై నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. 2026 తమిళనాడు ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ భావజాలాన్ని వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకి లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులు…
TVK Chief Vijay: ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలిత తరహాలోనే.. తన సినీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. అయితే, శివాజీ గణేషన్, విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు తమ ప్రజాదరణను ఎన్నికల విజయంగా మార్చుకోలేకపోయినా, విజయ్ దళపతి మాత్రం ఈ పరంపరను…
క క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు.. ముస్లిం కూడా తన మతాన్ని గౌరవించుకుంటాడు.. కానీ, హిందువులు మాత్రం తమ మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరామని ప్రశ్నించారు. ఇది అసలైన నకిలీ సెక్యులరిజం.. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా జీవిస్తున్నాను.. నా మతాన్ని గౌరవించడమే కాదు, ఇతర మతాలనూ గౌరవిస్తున్నాను, ఇది నా హక్కు అని ప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తమిళనాడులో పర్యటించనున్న విషయం తెలిసిందే. మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు కాసేపటి క్రితం ప్రత్యేక విమానంలో మధురై చేరుకున్నారు. మధురై విమానాశ్రయంలో పవన్‌కి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం.. అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడులో ముఖ్య అతిథిగా పవన్…
హిందూ మున్నణి సంస్థ ఆధ్వర్యంలో నేడు ‘మురుగన్ మహా భక్త సమ్మేళనం’ జరగనుంది. మధురైలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్త సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు హిందూ మున్నణి సంస్థ అధ్యక్షుడు కాడేశ్వర సుబ్రహ్మణ్యన్ తెలిపారు. అమ్మ తిడల్, పాండి కొవిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ భక్త సమ్మేళనానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే…
Tamil Nadu: తమిళనాడులో మధురై సమీపంలోని కుమారస్వామి దేవాలయం ఉన్న తిరుపరంకుండ్రంపై వివాదం చెలరేగింది. తమిళులు ఎంతో భక్తిగా పూజించే సుబ్రమణ్య స్వామి కొలువుదీరిన కొండని కొందరు ముస్లింలు అపవిత్రం చేశారని హిందూ సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి.
Interesting News: తమిళనాడు మధురైలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. 1997లో రూ.60ని దొంగిలిచిన వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక పోలీసుల బృందం గుర్తించింది. శివకాశికి చెందిన 55 ఏళ్ల పన్నీర్ సెల్వం అనే వ్యక్తిని మధురై జిల్లా పోలీసులు అరెస్ట్ చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును గుర్తించేందుకు అసిస్టెంట్ కమిషనర్ సూరకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Refrigerator blast: తమిళనాడులో మదురైలోని ఓ లేడీస్ హాస్టల్లో ఫ్రిజ్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు. పలువురికి గాయాలైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఒక గదిలో ఎలక్ట్రానిక్ పరికరం పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మదురైలోని కాట్రపాళయంలో ఈ హాస్టల్ ఉంది, ఇక్కడ అనేక మంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటున్నారు.
Fridge Explodes in Women’s Hostel in Madurai: తమిళనాడులోని మదురైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మదురై జిల్లా కాట్రంపళయం ప్రాంతంలోని విసాక ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో ఈరోజు తెల్లవారుజాము 4:30 గంటల సమయంలో ఫ్రిడ్జ్ పేలింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రిఫ్రిజిరేటర్ దగ్గర నిద్రిస్తున్న ఇద్దరు యువతులు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. Also…
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన తనను అడ్డుకున్నారని నమిత వీడియోను రిలీజ్ చేశారు, నన్ను, నా కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని సిబ్బంది దురుసుగా, అహంకారంగా మాట్లాడారని నమిత వీడియోలో తెలిపింది.