Liquor on Road: మద్యం లారీ బోల్తా.. బాటిళ్ల కోసం పోటీ పడ్డ మందుబాబులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ కాలంలో అయినా డబ్బులు వచ్చే వ్యాపారం ఏదైనా ఉందంటే అది మద్యం వ్యాపారమే. పరిస్థితి ఎలా ఉన్నా.. రేటు ఎలా ఉన్నా మద్యం బాటిళ్ల కోసం మందుబాబులు ఎగబడతారు. అందులోనూ ఇక ఉచితంగా దొరికితే వదిలిపెట్టే సమస్యే లేదు. తాజాగా తమిళనాడులోని మధురైలో ఉచిత మద్యం కోసం జనాలు ఎగబడ్డారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా మనోళ్లు వదలరు. అలాంటిది క్వాటర్ బాటిల్స్ దొరికితే, బీరు బాటిల్స్ బాక్సులు కనపడితే వదులుతారా..?
Kerala: కేరళలో కొత్త రకం వైరస్… కంగారు పెడుతున్న టమాటో ఫ్లూ
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
వివరాల్లోకి వెళ్తే.. మధురై జిల్లా విరంగనూర్ వద్ద జాతీయ రహదారిపై మద్యం లోడుతో వెళ్తున్న మినీ లారీ బోల్తా పడింది. కేరళలోని మనలూర్‌లో ఉన్న లిక్కర్ డిపో నుంచి మద్యం బాటిళ్లను తమిళనాడుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో లారీలో ఉన్న లిక్కర్ బాక్సులు మొత్తం రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. లారీ అలా బోల్తా కొట్టిందో లేదో మందుబాబులు అలా పట్టేశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు మద్యం బాక్సులను చూసి వెంటనే తమ వాహనాలను ఆపారు. రోడ్డుపై పడిన మద్యం బాటిళ్లను అందిన కాడికి ఎత్తుకెళ్లారు. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్లీ రాదని భావించి బాటిళ్లకు బాటిళ్లు పట్టుకెళ్లారు. కొందరైతే పెట్టెలను కూడా ఎత్తుకెళ్తూ కనిపించారు. అయితే లారీలో ఉన్న డ్రైవర్ సంగతి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగే సమయానికి రోడ్డుపై బాటిల్స్ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు.

తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!