కరోనా కాలంలో వివాహాలు విచిత్రంగా జరుగుతున్నాయి. కొంత మంది ఆన్‌లైన్ ద్వారా వివాహాలు చేసుకుంటే, మరికొందరు పరిమిత సంఖ్యతో వివాహాలు చేసుకుంటున్నారు. అయితే, తమిళనాడులోని మధురైకు చెందిన ఇద్దరు వ్యాపావేత్తల పిల్లల వివాహం విచిత్రంగా జరిగింది. మధురై నుంచి తుత్తుకూడి వరకు ఓ ప్రైవేట్ జెట్ విమానం బుక్ చేసుకున్నారు. అందులో మొత్తం 161 మంది అతిధులు బయలుదేరారు. మధురై నుంచి విమానం బయలుదేరగానే వధువు దక్షిణ మెడలో వరుడు రాకేష్ తాళి కట్టాడు. మధురై నుంచి తత్తుకూడి చేరిన విమానం అక్కడి నుంచి తిరిగి మధురైకి చేరింది. వీరి వివాహం ఇప్పుడు ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.