Viral: పిల్ల దొరకడం లేదట.. చివరకు ఏం చేశాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగం ఉన్నా, జీవితంలో సెటిల్ అయినా.. పెళ్లి కాని ప్రసాద్‌లు ఎంతో మంది ఉన్నారు.. వారు పెళ్లి కోసం చేయని ప్రయత్నాలు ఉండవు.. కానీ, ఏంటో పిల్ల దొరకక ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి.. అలాంటి పరిస్థితే ఓ యువకుడికి ఎదురైంది.. ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ మంచి జీతం పొందుతున్న 27 ఏళ్ల యువకుడుకి పెళ్లిపై మనసైంది.. తగిన జోడు కోసం బాగానే ప్రయత్నాలు చేశాడట.. అయినా.. ఎవరూ దొరకకపోవడంతో.. అతడికి ఓ ఐడియా వచ్చింది.. దాంతో.. తన పేరు, కులం, జీతం, వృత్తి, కాంటాక్ట్ నంబర్ , ఫొటో, అడ్రస్.. ఇలా అన్నీ పొందుపరుస్తూ.. ఓ పోస్టర్‌ను డిజైన్ చేయించాడు.. ప్రింట్ వేయించి అక్కడక్క అంటించాడు.. ఇప్పుడా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
Read Also: GST: క్యాసినో, ఆన్‌లైన్ గేమ్స్, గుర్రపు పందాలపై భారీగా జీఎస్టీ..!
Also Read
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
- BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
తమిళనాడులో వైరల్‌గా మారిన ఓ పోస్టర్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మదురైలో భార్య కావాలంటూ ఎక్కడా చూసినా పోస్టర్లు దర్శమనిస్తున్నాయి.. మదురైలో ఉంటున్న 27 ఏళ్ల జగన్.. ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడట.. ఇక, పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన జగన్.. ఐదేళ్లుగా తనకు కాబోయే జీవిత భాగస్వామి కోసం వెతకడం మొదలు పెట్టాడట.. అయినా.. అతడి ప్రయత్నాలు ఫలించలేదు.. దీంతో, అతడికి ఓ ఐడియా తట్టింది.. తన పేరు, కులం, జీతం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ వివరాలన్నీ వెల్లడిస్తూ.. తన ఫొటో కూడా వచ్చేలా చూసుకుంటూ.. ఓ పోస్టర్ రూపొదించాడు.. కంపెనీ పేరు, తనకు నెలకు రూ.40 వేల జీతం వస్తుందనే వివరాలు.. అన్నీ పొందుపర్చాడు.. గతంలో డిజైనర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో.. అతడి బుర్రకు ఈ ఐడియా తట్టిందట.. వెంటనే వాటిని ప్రింట్ వేయించి.. మదురైతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అంటించాడు.. ఇప్పుడా పోస్టర్లు తమిళనాడులో వైరల్‌గా మారాయి.. అబ్బాయి బాగానే ఉన్నాడు.. మరి పోస్టర్ చూసైనా.. అమ్మాయిలు ఎవరైనా ముందుకు వస్తారో..? తమ కూతురు ఇచ్చేందుకు ఏ తండ్రి అయినా సంప్రదిస్తాడేమో చూడాలి..
- Tags
- bride
- Madurai
- Man
- posters
- Tamil Nadu
తాజావార్తలు
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!