ప్రజలను ఆకర్షించడానికి ఆయా కంపెనీలు, సంస్థలు, హోటళ్లు.. ఇలా చాలా మంది ఆఫర్లు పెడుతుంటారు… దీంతో.. ప్రజలు తమ వెసులుబాటును బట్టి.. కొనుగోళ్లకు మొగ్గు చూపుతుంటారు.. ఇక, బిర్యానీపై ఆఫర్ పెడితే.. అది కూడా 5 పైసలకే ఓ బిర్యానీ అంటే వదిలిపెడతారా..? ఎగబడి మరీ బిర్యానీ తీసుకోవడానికి పోటీపడ్డారు.. ఓవైపు కరోనా మహమ్మారి భయాలో ఉన్నా.. కోవిడ్ రూల్స్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. బిర్యానీ దొరికితే చాలు అనే రీతిలో ఎగబడ్డారు ప్రజలు.
ఐదు పైసలకే బిర్యానీ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళనాడు మధురైలోని సెల్లూర్ లో ఓ కొత్త బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించారు.. ప్రారంభోత్సవ ఆఫర్ కింద.. పాత ఐదుపైసల నాణెం ఇస్తే బిర్యానీ ఫ్రీ అని ప్రకటించింది యాజమాన్యం.. దీంతో.. పెద్ద ఎత్తున పాత ఐదు పైసల నాణెం పట్టుకుని బిర్యానీ సెంటర్‌కు తరలివచ్చారు ప్రజలు.. కరోనా నిబంధనలను గాలికి వదిలేసి బిర్యానీ కోసం పోటీపడ్డారు. ఎంతైనా బిర్యానీకి ఉన్న క్రేజే వేరు.. అది కూడా ఐదు పైసలకే వస్తుందంటే వదిలేస్తారా? మరి.