Viral Video: ఇటీవల కాలంలో యువత గుండెపోటుతో హఠాత్తుగా మరణిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేస్తూ కుప్పకూలిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లోని విదిషలో జరిగింది. పెళ్లి వేడుకల్లో డ్యాన్సు చేస్తూ, 23 ఏళ్ల యువతి ఉన్నట్టుండి కుప్పకూలింది. స్టేజ్ పైనే పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Father Funeral Rites: మధ్యప్రదేశ్‌లోని తికమ్గఢ్ జిల్లా లిధౌరా తాల్ గ్రామంలో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. 85 ఏళ్ల ధ్యాని సింగ్ ఘోష్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించే విషయంలో ఇద్దరు కుమారులు దామోదర్, కిషన్ సింగ్ ఘోష్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ వివాదం ఎంతంగా ముదిరందంటే.. చివరకు తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరూ విడివిడిగా అంత్యక్రియలు నిర్వహించేంతగా. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి 3వ…
Cremation dispute: అన్నదమ్ముల మధ్య తండ్రి అంత్యక్రియల వివాదం ఏకంగా, తండ్రి మృతదేహాన్ని సగం నాకు ఇవ్వాలని అనే దాకా వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టికామ్‌గఢ్ జిల్లాలో జరిగింది. తండ్రి అంత్యక్రియల్లో సోదరుల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో అంత్యక్రియల వివాదంలో పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. టికామ్‌గఢ్ జిల్లాల ప్రధాన కార్యాలయం నుంచి 45 కి.మీ దూరంలో ఉన్న లిధోరాతాల్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. చిన్న కుమారుడు దేశ్‌రాజ్…
Crime: తనలో మాట్లాడటం లేదని ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. మహిళ గొంతు కోశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో జరిగింది. 23 ఏళ్ల వ్యక్తి మహిళ గొంతు కోసం గాయపరిచినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఇండోర్‌కి 40 కి.మీ దూరంలోని సాన్వర్ పట్టణంలో అమన్ షేక్ అనే నిందితుడు ఎంబీఏ విద్యార్థినిపై కత్తితో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
Boondi Laddoo: నాలుగేళ్లుగా తప్పించుకుతిరుగుతున్న ఓ హత్య కేసులో దోషిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున ‘‘ బూందీ లడ్డూ’’ ని పంచుతూ అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెరోల్ పొందిన తర్వాత అప్పటి నుంచి దోషి పరారీలో ఉన్నాడు. 2008లో ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
Wife harassment: తప్పుడు ‘‘వరకట్న వేధింపులు’’ భర్తల ఆత్మహత్యలకు కారణమవుతోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో భార్య వేధింపులు భరించలేక ఓ ఫోటోగ్రాఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె ముగ్గురు బంధువుల కారణంగా ఈ చర్యకు పాల్పడ్డాడని, వారిపై కేసులు నమోదు చేసినట్లు గురువారం ఒక పోలీస్ అధికారి తెలిపారు. ‘‘వరకట్న నిషేధ చట్టాలను’’ మహిళలు దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం మార్పులు చేయాలని కోరుతూ.. నితిన్ పడియార్(28) జనవరి 20న ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. Read Also:…
IAS Officers Transfer: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం నాడు అర్థరాత్రి సీఎం కార్యదర్శి సహా 42 మంది ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్కార్ ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Rahul Gandhi: మధ్యప్రదేశ్ మోవ్‌లో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ర్యాలీని సోమవారం కాంగ్రెస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్పై మరోసారి విరుచుకుపడ్డారు. మన రాజ్యాంగాన్ని మార్చిన రోజు దేశంలో వెనకబడిన వారికి, దళితులకు, గిరిజనులకు ఒరిగేది ఏం ఉండదని అన్నారు.
Liquor Ban : మధ్యప్రదేశ్‌లో మొదటి నుండి మద్యపాన నిషేధం ఒక పెద్ద సమస్యగా ఉంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు నిరంతరం మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.