MP Horror: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. బంధువులే 19 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా ప్రవర్తించారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను 15 అడుగులు ఎత్తైన టెర్రస్ నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్‌లో జరిగింది. యువతి బంధువులే, పొరుగింటి వారి టెర్రర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నేరంలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నారు. వీరిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: PM Modi: “AIతో జాగ్రత్తగా ఉండాలి”.. పారిస్ సదస్సులో ప్రధాని మోడీ..
బాధిత యువతి అరుపులు విన్న తల్లిదండ్రులు వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి చూసే సరికి రక్తపుమడుగులో పడి ఉంది. ఆమె తండ్రి వెంటనే 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఇంకా పరిస్థితి దిగజారితే వైద్య చికిత్స కోసం జబల్ పూర్‌కి తరలించే అవకాశం ఉంది. పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగున్నాయి.