Crime: తనతో మాట్లాడటం లేదని విద్యార్థిని గొంతు కోసిన వ్యక్తి..
- తనతో మాట్లాడటం లేదని మహిళ గొంతు కోసిన వ్యక్తి..
- మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: తనలో మాట్లాడటం లేదని ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఎంబీఏ విద్యార్థిని గొంతు కోశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో జరిగింది. 23 ఏళ్ల వ్యక్తి విద్యార్థిని గొంతు కోసి గాయపరిచినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఇండోర్‌కి 40 కి.మీ దూరంలోని సాన్వర్ పట్టణంలో అమన్ షేక్ అనే నిందితుడు ఎంబీఏ విద్యార్థినిపై కత్తితో దాడి చేసినట్లు అధికారులు చెప్పారు.
Read Also: Yamaha: స్పోర్ట్స్ బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ బైక్స్‌పై రూ.1.10 లక్షల వరకు డిస్కౌంట్!
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
గాయపడిన విద్యార్థిని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని డీసీసీ ఉమాకాంత్ చౌదరి తెలిపారు. షేక్, బాధితురాలు ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు. కొన్ని రోజులుగా ఫాలో చేస్తూ వేధిస్తున్నట్లు తెలిసింది. సంఘటన జరిగిన రోజు నిందితుడు, ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కత్తితో గొంతు కోశాడు.
షేక్ తనని గత 3 ఏళ్లుగా వేధిస్తున్నాడని, హెచ్చరించినప్పటికీ అతడు బుద్ధి మార్చుకోలేదని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. ఈ దాడి స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆగ్రహించిన హిందూ సంఘాలు శుక్రవారం సాన్వర్ బంద్‌కి పిలుపునిచ్చాయి. ప్రస్తుతం సాన్వర్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!