Madhya Pradesh: ప్రస్తుత కాలంలో సాధారణ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నారు. కానీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుమారుడు మాత్రం ఈ విషయంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో మావోల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోని మావోయిస్టులను మాత్రం భద్రతా దళాలు అంతమొందిస్తున్నాయి.
Shocking: మధ్యప్రదేశ్లో షాకింగ్ సంఘటన జరిగింది. అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి చేయాల్సింది పోయి, వారి పేరెంట్స్ లేచిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి, తన కూతురుకు కాబోయే అత్తగారితో లేచిపోయాడు. వధువు తండ్రి, వరుడి తల్లి ఇద్దరు కలిసి పారిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. పిల్లల నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో 8 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. గురువారం పోలీసులు పారిపోయిన మహిళను కనుగొన్నారు.
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ధార్ జిల్లాలోని పితంపూర్లో రైల్వే వంతెన నిర్మాణ పనుల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా భారీ క్రేన్ బోల్తా పడింది.
నేరాలను అరికట్టాల్సిన ఖాకీనే కిలాడీగా మారింది. చేసేది పవర్ఫుల్ ఉద్యోగం.. బుద్ధేమో కంత్రీ బుద్ధి. స్నేహితురాలి ఇంటికొచ్చి ఆమె ఇంటికే కన్నం వేసింది. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూసి అంతా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
School Girls: మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలోని నైన్పూర్లో స్కూల్ యూనిఫాం ధరించిన ఇద్దరు విద్యార్థినులు నేరుగా మద్యం దుకాణానికి వచ్చి, మద్యం కొనగోలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైన్ షాప్ ముందు ఉన్న సీసీ టీవీలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్ యూనిఫాంలో వచ్చి మందు కొంటున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి.
Carbide gun: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రజలు తమ కుటుంబాలతో పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, కొందరికి మాత్రం దీపావళి విషాదాన్ని మిగిల్చింది. కంటిచూపు కోల్పోయేలా చేసింది. ‘‘కార్బైడ్ గన్’’ వల్ల మధ్యప్రదేశ్లో 122 మంది పిల్లలు గాయపడ్డారు. వీరిలో 14 మంది కంటి చూపు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే వీరంతా గాయపడ్డారు. ఈ కార్బైడ్ గన్ను ‘‘దేశీ ఫైర్ క్రాకర్ గన్’’గా కూడా పిలుస్తారు. Read Also: Chiranjeevi : చిరంజీవి…
Worm In Antibiotic Syrup: మధ్యప్రదేశ్లో కల్తీ దగ్గు సిరప్ కారణంగా 20 మంది పిల్లలు మరణించిన విషయం మరవక ముందే.. మరో కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈసారి యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ సిరప్ (Azithromycin Oral Suspension Syrup)లో ఈ లోపం బయటపడింది. అందిన నివేదిక వివరాల ప్రకారం.. గ్వాలియర్ లోని మురార్ జిల్లా ఆసుపత్రిలో పిల్లలకు ఇచ్చిన యాంటీబయాటిక్ సిరప్లో పురుగులు కనిపించాయి. ఈ ఘటన వెలుగులోకి రావడానికి కారణం ఒక తల్లి. తన…
మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టడంతో 21ఏళ్ల యువకుడు మరణించాడు. ఈ ఘటనతో పోలీసులు అధికార దుర్వినియోగం చేశారంటూ ఆందోళనలు చెలరేగాయి. Read Also: Thanjavur Horror: అసలు వీడు కన్నతండ్రేనా.. భార్య మీద కోపంతో ఏం చేశాడంటే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్ ప్లానీలోని ఇంద్రపురిలోని ఒక తోట పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో స్నేహితులతో పార్టీ చేసుకుంటుండగా, డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు కొట్టడంతో శుక్రవారం తెల్లవారుజామున…
Cough syrup: ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు 21 మంది చిన్నారులను బలి తీసుకుంది. ఆరోగ్యాన్ని నయం చేయాల్సిన మందు, పిల్లల ప్రాణాలను తీసింది. కోల్డ్రిఫ్ దగ్గు మందు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరణాల నేపథ్యంలో మధ్యప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలు ఈ మందును నిషేధించాయి.