Viral Video: ఇటీవల కాలంలో యువత గుండెపోటుతో హఠాత్తుగా మరణిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేస్తూ కుప్పకూలిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లోని విదిషలో జరిగింది. పెళ్లి వేడుకల్లో డ్యాన్సు చేస్తూ, 23 ఏళ్ల యువతి ఉన్నట్టుండి కుప్పకూలింది. స్టేజ్ పైనే పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: INDIA bloc: మేమంతా కలిసే ఉన్నాం, లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ వస్తాం..
గుండెపోటు కారణంగా యువతి మరణించి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతురాలిని ఇండోర్ నివాసి పరిణిత(23)గా గుర్తించారు. ఆమె తన బంధువు వివాహం కోసం విదిష వెళ్లింది. ఈ సంఘటన శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. పరిణిత పెళ్లి వేడుకల్లో భాగంగా స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్న సందర్భంలో హఠాత్తుగా కుప్పకూలింది. బంధువులు, వివాహానికి హాజరైన కొంతమంది వైద్యులు వెంటనే సీపీఆర్ చేసి, బ్రతికించేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆమెను విదిషలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
Madhya Pradesh – A young woman collapsed while dancing on stage at her sister's wedding in Vidisha. Relatives who were there rushed her to the hospital, but doctors declared her dead.
How normal this has become post c0vid jabs yet no one questions!@shreyastalpade1 @MoHFW_INDIA https://t.co/dxJBVwT9ey pic.twitter.com/JwoWTUvz7B— Dee (@DeeEternalOpt) February 9, 2025